దిమ్మిడిజోలలో మహిళ ఆత్మహత్య
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:55 AM
మండలంలోని దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కేవాటి సరస్వతి(34) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.
భామిని, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కేవాటి సరస్వతి(34) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రెండేళ్ల కిందట సరస్వతి భర్త మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఉపాధికోసం వలస పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఇంతలో పొలం పనికి వెళ్లి తోటలో ఉరిపోసుకుంది. ఇటీవల ఘనసర గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహితేర సంబంధం పెట్టుకొందని, ఆయనతో మనస్పర్థలు రావడంతో తన కుమార్తె ఉరిపోసుకున్నట్లు తండ్రి కేవటి ఆదినారాయణ వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బత్తిలి ఎస్ఐ కె.రవ్రీంద తెలిపారు. మృతదేహాన్ని సీతంపేట సీహెచ్సీకి పోస్టుమార్టం నిమి త్తం తరలించారు. సరస్వతి పిల్లలు వరుణ్కుమార్, సుధీర్లు అనాఽథలయ్యారని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.