Share News

సముద్రంలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:20 AM

సంతా నం లేదనే మనస్తాపంతో ఓ మహిళ సముద్రంలో దూకి ఆత్మహత్యకు యత్నించగా, సకాలంలో లైఫ్‌ గార్డులు రక్షించి తీరానికి తీసుకొచ్చారు.

సముద్రంలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

  • రక్షించి తీరానికి తీసుకొచ్చిన లైఫ్‌గార్డులు

  • బాధితురాలు మన్యం జిల్లా వాసి

మహారాణిపేట/ బీచ్‌ రోడ్డు (విశాఖపట్నం), ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): సంతా నం లేదనే మనస్తాపంతో ఓ మహిళ సముద్రంలో దూకి ఆత్మహత్యకు యత్నించగా, సకాలంలో లైఫ్‌ గార్డులు రక్షించి తీరానికి తీసుకొచ్చారు. వివరాలిలా ఉన్నా యి. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం నాయుడు వీధికి చెందిన ఓ మహిళకు పిల్లలు కలగలేదు. దీంతో కొందరు సూటిపోటి మాటలతో అవమానించడంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం నగరానికి చేరుకొని ఉదయం 11 గంటల సమయంలో సముద్రం లోపలకు వెళ్లి ఆత్మహత్య కు యత్నించింది. దీన్ని గమనించిన లైఫ్‌గార్డులు, బ్లూ కోట్‌ సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను రక్షించి తీరానికి తీసుకొచ్చి సపర్యలు చేశారు. అనంతరం ఆమెతో మాట్లాడి వివరాలు, పరిస్థితిని తెలుసుకున్నారు. మమతా ట్రస్ట్‌కు చెం దిన మమతకు సమాచారం అందించగా, ఆమె ఘటనా స్థలానికి చేరుకొని సహాయం చేశారు. మమత సహకారంతో బాధిత మహిళను అవసరమైన పునరావాసం, చికిత్స కేంద్రానికి తరలించారు. కేసును టూ టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:20 AM