Share News

ప్రియుడిని హతమార్చిన మహిళ అరెస్టు

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:33 AM

ప్రియుడిని హత్యచేసిన రాములమ్మ అనే మహిళను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.

 ప్రియుడిని హతమార్చిన మహిళ అరెస్టు

గరివిడి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రియుడిని హత్యచేసిన రాములమ్మ అనే మహిళను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని కందిపేట గ్రామానికి చెందిన దనాల రాములమ్మ అనే మహిళ తనతో సహజీవనం చేసే దనాల శ్రీను అనే వ్యక్తి రెండు రోజుల కిందట అతి కిరాతకంగా హత్య చేశారు. హత్యానేరం కింద ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. చీపురుపల్లి సీఐ జి.శంకర రావు, గరివిడి ఎస్‌ఐ బి.లోకేశ్వరరావులు విలేకర్లతో మాట్లాడుతూ రాములమ్మను అరెస్టు చేసి, రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు తెలిపారు.

Updated Date - Sep 20 , 2026 | 12:33 AM