నిర్వహణ లేక.. మరమ్మతులకు నోచుకోక
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:19 AM
మండలంలోని ధర్మవరం బీసీ వసతిగృహం విద్యార్థుల పరిస్థితి అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చం దంగా కనిపిస్తోంది. 2017లోచలికాలంలో విద్యార్థులు ఉదయం పూట చన్నీటీ స్నానం చేసి ఇబ్బందులుపడతారని భావించి సోలార్‌హీటర్లను రాష్ట్ర ప్రభు త్వం ఎంపికచేసిన వసతిగృహాలకు సమకూర్చింది.
ఎస్.కోట రూరల్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ధర్మవరం బీసీ వసతిగృహం విద్యార్థుల పరిస్థితి అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చం దంగా కనిపిస్తోంది. 2017లోచలికాలంలో విద్యార్థులు ఉదయం పూట చన్నీటీ స్నానం చేసి ఇబ్బందులుపడతారని భావించి సోలార్‌హీటర్లను రాష్ట్ర ప్రభు త్వం ఎంపికచేసిన వసతిగృహాలకు సమకూర్చింది. ఇందులో భాగంగా ధర్మ వరం వసతిగృహానికి ఒక యూనిట్ కేటాయించారు. రెండేళ్లపాటు వాడుకలో ఉన్నాయి. తర్వాత నిర్వహణకు నోచుకలేదు. పాడైనా అప్పటి వార్డెన్ మరమ్మ తులపై దృష్టిపెట్టకపోవడంతో మూలకుచేరాయి.తర్వాత వచ్చిన వార్డెన్లు మర మ్మతులపైఉన్నతాధికారులకు లేఖలురాసినా వారినుంచి స్పందన లేకపోవడం తో లక్షల రూపాయలు విలువచేసేసోలార్‌హీటర్లు నిరుపయోగంగా మారాయి. పాడైన వెంటనే మరమతులు చేయించి ఉంటే ప్రస్తుతం శీతకాలంలో ఎంత గానో ఉపయోగపడేవని విద్యార్థులు చెబుతున్నారు. సోలార్ హీటరు నిరుప యోగంగా ఉండడంతో విద్యార్థులు వాటిని ప్రస్తుతం బట్టలు ఆరబెట్టుకో వడానికి వినియోగిస్తున్నారు. కాగా సోలార్‌హీటర్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే పాడయ్యాయని బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి కృష్ణ తెలిపారు. తమకు నివేదిక వచ్చిందని, ఇవి మరమ్మతులకు అవసరమైన పరికరాలు లేకపోవడంతో వీటిని బాగుచేయించడం సాధ్యం కాలేదని చెప్పారు.