Share News

ఐదు గంటల వ్యవధిలో..

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:33 AM

మండలం లోని వల్లాపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంటిలో ఐదు గంటల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు.

ఐదు గంటల వ్యవధిలో..

  • ఒకే ఇంట్లో ఇద్దరి మృతి

  • గుండెపోటుతో మరిది.. ఏడుస్తూ కూర్చున్న చోటే వదిన..

  • వల్లాపురంలో తీవ్ర విషాదం

గుర్ల, జూలై 30(ఆంధ్రజ్యోతి): మండలం లోని వల్లాపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంటిలో ఐదు గంటల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. గుర్ల మండలం వల్లాపురం గ్రామానికి చెందిన పైల శ్రీరాములు(45) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విజయ నగరం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నాడు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. వెంటనే మృతదేహాన్ని స్వగ్రామం వల్లాపురం తీసుకువచ్చి, ఇంటి వద్ద ఉంచారు. కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా ఏడుపులు మొదలుపెట్టారు. మృతుడి పెద్ద వదిన అయిన పైల అప్పలకొండ(35) ఏడుస్తూ గురువారం ఉదయాన్నే కూర్చు న్న చోటే కన్నుమూసింది. ఒకే ఇంటిలో ఒకేసారి ఇద్దరు మృతిచెందడంతో కుటుం బ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో విషాదం అలము కుంది. శ్రీరాములకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే విధంగా అప్పలకొండ భర్త మృతిచెంది రెండు సంవత్సరాలు కావస్తోంది. ఈమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

Updated Date - Jul 31 , 2026 | 12:33 AM