Share News

Withdrawal of nominations today నేడు నామినేషన్ల ఉపసంహరణ

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:25 AM

Withdrawal of nominations today జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం జరగనుంది. 27మండలాల జడ్పీటీసీ స్థానాలకు గాను వివిధ పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థుల నుంచి 258 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటి పరిశీలన తర్వాత నాలుగు తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.

Withdrawal of nominations today నేడు నామినేషన్ల ఉపసంహరణ

నేడు నామినేషన్ల ఉపసంహరణ

విజయనగరం/కంటోన్మెంటు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం జరగనుంది. 27మండలాల జడ్పీటీసీ స్థానాలకు గాను వివిధ పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థుల నుంచి 258 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటి పరిశీలన తర్వాత నాలుగు తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఆ నలుగురు అప్పీలుకు వెళ్లగా ఒక్కరు మాత్రమే పోటీకి ఆమోదం పొందారు. దీంతో మొత్తం 255 మంది పోటీ చేయడానికి అర్హత సాధించినట్లయింది. వీరిలో పోటీనుంచి తప్పుకోవాలనుకొనేవారు మంగళవారం జడ్పీ కార్యాలయానికి వచ్చి నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3గంటల సమయానికి ఉపసంహరించుకోకుంటే పోటీలో ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తన నిబంధనలో తెలిపింది. మరి నేడు ఎంత మంది బరిలో ఉంటారో, ఎంత మంది నిష్క్రమిస్తారో చూడాలి.

- జిల్లా వ్యాప్తంగా 449 ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేసిన 2577 మందిలో వివిధ పార్టీలు, రెబల్స్‌, స్వతంత్రులు కలిసి 446 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే అధికారికంగా మంగళవారం మధ్యాహ్నం 3గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంది. చివరి రోజు ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారో చూడాలి. ఆ తర్వాతే అధికారికంగా ఎంత మంది పోటీలో ఉంటారో అధికారులు ప్రకటిస్తారు.

Updated Date - Oct 27 , 2026 | 12:25 AM