బరువెక్కిన హృదయాలతో...
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:31 AM
పెద్ద పండుగ ముగియడంతో బంధు మిత్రు లంతా బరువెక్కిన హృదయంతో తిరిగి వెళుతు న్నారు.
విజయనగరం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పెద్ద పండుగ ముగియడంతో బంధు మిత్రు లంతా బరువెక్కిన హృదయంతో తిరిగి వెళుతు న్నారు. బస్సులు, రైళ్ల రద్దీతో కష్టంగా ప్రయాణి స్తున్నారు. శుక్రవారం కనుమ భోజనాలు చేసి కొంతమంది వెళ్లిపోయారు. శనివారం ఉదయం నుంచి కూడా ప్రయాణాలు ఎక్కువయ్యాయి. ఆదివారం నాటికి ఊపందుకోనున్నాయి. స్వగ్రా మాలకు ముందస్తు రిజర్వేషన్లతో వచ్చినవారు రైళ్లు, బస్సుల్లో వెళుతున్నారు.
అన్నిచోట్ల అంతే..
విజయనగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ శనివారం రద్దీగా కనిపించింది. ఎవరు చూసినా నాలుగేసి బ్యాగు లతో కనిపించారు. బంధువులు ఇచ్చిన పిండివంటలు, పొలాల్లో పండిన పంటలు, కూరగా యలను, పండ్లను తీసుకెళ్లారు. విజయనగరం బస్టాండ్, రైల్వేస్టేషన్, బొబ్బిలి, రాజాం, గజప తినగరం, ఎస్.కోట, కొత్తవలస, చీపురుపల్లితో పాటు అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించా యి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఒకేసారి బయలుదేరడంతో బస్సులన్నీ నిండి పోయి కనిపించాయి. రైళ్లు కూడా రద్దీగా మారాయి. కొన్ని ప్రైవేటు బస్సులు రహదారు లపైకి వచ్చాయి. అధిక ధర టిక్కెట్లు అనిచెప్పినా ప్రయాణికులు వెనక్కి తగ్గలేదు. ఆదివారం సైతం జిల్లా నుంచి లక్షలాది మంది వెళ్లనుండడంతో ప్రైవేటు వాహనాలు సొమ్ము చేసుకోనున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు, అనదపు సర్వీసులు నడిపినా జనానికి తగ్గట్టు ఎంతమాత్రం చాలలేదు.
బోసిపోయిన పల్లెలు..
సంక్రాంతి పండుగకు వచ్చిన బంధుమిత్రులు, అల్లుళ్లతో వారం రోజుల పాటు గ్రామాలు, పట్టణాలు కళకళలాడుతూ కనిపించాయి. ఈసారి ప్రతి ఇంటికీ బంధువులతో పాటు అతిథులు వచ్చారు. ముఖ్యంగా నగరాల్లో చదువుకునే వారు తమ స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చారు. సినిమా థియేటర్లతో పాటు పేరుమోసిన హోటళ్లు, దాబాలు రద్దీగా మారాయి. వారం పాటు సందడిగా కనిపించిన వాతావరణం శనివారం నుంచి కనుమరుగైంది