Share News

With 90% Subsidy… 90శాతం సబ్సిడీతో..

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:18 AM

With 90% Subsidy… సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 20సబ్‌ప్లాన్‌ మండలాల్లో గిరిజన రైతులకు 90శాతం సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీకి రంగం సిద్ధ మైంది. ట్రైకార్‌ పథకంలో భాగంగా ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్‌ కింద రూ.3.32కోట్లతో కొనుగోలు చేసిన యంత్ర పరికరాలను పంపిణీ అర్హులకు అందజేయనున్నారు.

With 90% Subsidy… 90శాతం సబ్సిడీతో..
పంపిణీకి సిద్ధంగా ఉన్న మినీ ట్రాక్టర్లు

  • త్వరలో పంపిణీ

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌6(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 20సబ్‌ప్లాన్‌ మండలాల్లో గిరిజన రైతులకు 90శాతం సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీకి రంగం సిద్ధ మైంది. ట్రైకార్‌ పథకంలో భాగంగా ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్‌ కింద రూ.3.32కోట్లతో కొనుగోలు చేసిన యంత్ర పరికరాలను పంపిణీ అర్హులకు అందజేయనున్నారు. అదే విధంగా పసుపు ప్రాజెక్ట్‌ కింద సంబంధిత గిరిజన రైతులకు రూ.7.93కోట్లతో రాయితీ యూనిట్లను అందించ నున్నారు. వాస్తవంగా 90శాతం సబ్సిడీతో అందించనున్న యూనిట్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే అర్హులైన 1000 మందిని ఇప్పటికే అధికారులు ఎంపికచేశారు. వారికి త్వరలోనే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చేతుల మీదుగా వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనున్నామని హార్టికల్చర్‌ అధికారి గణేష్‌ తెలిపారు.

ఐటీడీఏకు చేరిన యంత్ర పరికరాలు

ఇప్పటికే వ్యవసాయ యంత్ర పరికరాలన్నీ సీతంపేట ఐటీడీఏకు చేరాయి. ఇవన్నీ సెంట్రలైజ్‌డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (కేంద్రీకృత సేకరణ)కింద సరఫరా అవుతున్నాయి. కాగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులకు.. 80 ఆయిల్‌ ఇంజన్లు, 25 మినీ ట్రాక్టర్లు, 28 పవర్‌ టిల్లర్లు, 53 పవర్‌ వీడర్లతో పాటు 12 మల్టీ క్రాప్‌ పెషర్స్‌ను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా టర్మరిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐటీడీఏ పరిధిలోని టీఎస్పీ మండలాల్లో 1000 ఎకరాల్లో పసుపు సాగు కోసం.. 2వేల మంది గిరిజన రైతులకు 90శాతం సబ్సిడీపై 680 మెట్రిక్‌ టన్నుల విత్తనాలు పంపిణీ చేయనున్నారు. 260మెట్రిక్‌ టన్నుల వేపపిండి, 2వేల లీటర్ల వేపనూనె, 1000 డబుల్‌ బ్యాటరీ స్ర్పేయర్లు, 2వేల టార్పాలిన్లు, 34 మినీ పాలిషర్లు, 34 బోయలర్స్‌(పసుపు ఉడకపెట్టే యంత్రం)లను అందించనున్నారు.

సంతోషంగా ఉంది..

గడిచిన ఐదేళ్ల కాలంలో సీతంపేట ఐటీడీఏ ద్వారా ఒక్క రాయితీ పథకం కూడా మాకు అందలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సబ్సిడీపై రుణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు అందించడం హర్షించదగ్గ విషయం. పసుపు రైతులకు 90శాతం రాయితీ కింద విత్తనాలు, యంత్రాలు అందించడం సంతోషంగా ఉంది.

- సవరతోటయ్య, గిరిజన రైతు, దిగువదారబ

Updated Date - Apr 07 , 2026 | 12:18 AM