Share News

రాజకీయాల్లో గెలుపోటములు సహజం

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:29 AM

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే కీలకమని జడ్పీ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు మజ్జి శ్రీనివాస రావు చెప్పారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం

  • జడ్పీ మాజీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం రూరల్‌, నవంబరు 15(ఆంధ్రజ్యో తి): రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే కీలకమని జడ్పీ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు మజ్జి శ్రీనివాస రావు చెప్పారు. ఆదివారం ఆయన తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు తమ పార్టీ ఓటమిని హుందాగా అంగీకరించి, తమ పార్టీని ప్రక్షాళన చేసుకోవాలని, విజయం సాధించిన వారికి విలువైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. అలా కాకుండా విజయం సాధించే వారిపై, ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కూటమికి 2024లో ప్రజలు పట్టం కట్టార ని, రెండున్నర ఏళ్ల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో సైతం ప్రజలు కూటమి పార్టీల కు చెందిన వారికి మద్దతు తెలిపారన్నారు. 2029లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయన్న విషయం వైసీపీ నాయకులు గుర్తుంచుకో వాలన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ సారథ్యంలో రాష్ట్రానికి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.

Updated Date - Nov 16 , 2026 | 12:29 AM