Share News

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:41 AM

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు.

  స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

  • టీడీపీ నేత మజ్జి శ్రీనివాసరావు

భోగాపురం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శ్రీనివాసరావు శుక్రవారం పోలిపల్లి గ్రామంలో బంగార్రాజును స్నేహ పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పార్టీ నాయకు లు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో నూటి కి నూరు శాతం టీడీపీ విజయకేతనం ఎగురవేసేలా కృషి చేస్తానన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, సువ్వాడ రవిశేఖర్‌, నీలాపు అప్పలరామిరెడ్డి, పతివాడ అప్పలనారాయణ, కడగల ఆనంద్‌, గేదెల రాజారావు, కర్రోతు రాజు, రామసూరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:41 AM