Share News

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:32 AM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ, అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావులు పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ రామకృష్ణ

జియ్యమ్మవలస, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ, అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావులు పిలుపునిచ్చారు. గురువారం జియ్యమ్మవలసలో మండల టీడీపీ కన్వీనర్‌ జోగి భుజంగరావు అధ్యక్షతన పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూత్‌ లెవెల్‌ నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఏకతాటిపై నడిచి స్థానికంతో సత్తా చాలాలని తెలిపారు.కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొంగు సురేష్‌, దత్తికామేశ్వరి, డొంకాడ మంగమ్మ, కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షులు డి.సోములు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:32 AM