నేతలను కలిసిన విజేతలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:59 PM
చీపురుపల్లి, మెరకముడిదాం మండలా లలో గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావును మం గళవారం రాజాంలోని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
గరివిడి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి, మెరకముడిదాం మండలా లలో గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావును మం గళవారం రాజాంలోని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేని సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగాలని, ప్రజలకు అందుబా టులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ను ఎల్.కోట, కొత్తవలస మండలాలకు చెందిన జడ్పీటీసీలుగా గెలిపొందిన కరెడ్ల ఈశ్వరరావు, గొరపల్లి జయప్రకాష్ (శివ)లతో పాటు ఎంపీటీసీలు మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం సాయంత్రం ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఈమె భర్త టీడీపీ నేత కోళ్ల బాలాజీ అప్పలరామ ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణలు వీరిని పరిచయం చేశారు. దీంతో పాటు ఎల్.కోట ఎంపీపీ గా ఖసాపేట ఎంపీటీసీగా గెలిచిన కోళ్ల ఉషాశ్రీ మోహన్, కొత్తవలస ఎంపీపీగా రామలింగాపురం ఎంపీటీసీగా విజయం సాధించిన కోళ్ల రమణమ్మను ఎంపిక చేసినట్టు వివరించారు. వీరందరినీ ఎంపీ అభినందించారు. టీడీపీ కొత్తవలస మండల అధ్యక్షుడు కోళ్ల శ్రీను, జనసేన నాయకుడు మేలాస్త్రీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.