డబ్బులిస్తావా.. చంపేయాలా?
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:31 AM
డబ్బులిస్తా వా.. చంపేయాలా అని ఓ షాపు యజమానిని బెదిరిం చిన రౌడీషీటర్‌ను పోలీసు లు అరెస్టు చేసిన ఘటన రాజాంలో చోటుచేసుకుంది.
గిఫ్ట్‌షాపు యజమానికి రౌడీషీటర్ బెదిరింపు
అరెస్టు చేసిన పోలీసులు
రాజాం రూరల్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): డబ్బులిస్తా వా.. చంపేయాలా అని ఓ షాపు యజమానిని బెదిరిం చిన రౌడీషీటర్‌ను పోలీసు లు అరెస్టు చేసిన ఘటన రాజాంలో చోటుచేసుకుంది. రాజాం టౌన్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సీఐ డి.నవీన్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కంచరాం గ్రామానికి చెందిన పట్నాల కొండరాజు రాజాం మెయిన్‌రోడ్‌లో గత 17ఏళ్లుగా గిఫ్ట్‌షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 13న సాయంత్రం మండల పరిధిలోని గురవాం గ్రామానికి చెందిన రౌడీషీటర్ రౌతు రాజు, కొండరాజుకు చెందిన గిఫ్ట్‌షాపు వద్దకు వచ్చి రూ.వెయ్యి ఇవ్వాలని డిమాం డ్ చేశాడు. తన వద్ద డబ్బులేదని కొండరాజు స్పష్టం చేయడంతో తాను రౌడీషీట ర్‌ని అని, డబ్బులు గానీ, షాపులో ఏదైనా వస్తువు గానీ ఇవ్వకపోతే ఇంటికి వెళ్లే మార్గంలో చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో చేసేదిలేక రూ.1300 విలువచేసే క్యారమ్‌బోర్డును ఆయన రౌడీషీటర్‌కు ఇచ్చాడు. షాపు వద్దకు వచ్చినట్టు గానీ, క్యారమ్‌బోర్డ్ ఇచ్చినట్టు గానీ ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై కొండరాజు రాజాం పొలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్‌ఐ సల్మాన్ బేగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రౌడీషీటర్ రాజును సోమవారం అరెస్ట్ చేసి, రిమాండ్ కోసం కోర్టులో ప్రవేశపెట్టారు.