గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా..
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:05 AM
విజయనగరంలోని గురజాడ కేంద్ర గ్రంథా లయాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మంగళవారం పరిశీ లించారు.
ఎమ్మెల్యే అదితి
విజయనగరం రూర ల్, జూలై 21(ఆంధ్రజ్యో తి): విజయనగరంలోని గురజాడ కేంద్ర గ్రంథా లయాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మంగళవారం పరిశీ లించారు. గ్రంథాలయా నికి వచ్చే పాఠకులతో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రోజుకి ఎంతమంది పాఠకులు గ్రంథాలయానికి వస్తున్నదీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ అభివృ ద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గ్రంథాలయం పక్కనే ఉన్న గురజాడ కళాభారతి ఆడిటోరి యంను పరిశీలించారు. అక్కడ పోటీ పరీక్షల కోసం చదువుతున్న విద్యార్థులను పలకరించారు. వారితో మాట్లాడి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.