సమావేశంలో కరపత్రాలు ప్రదర్శిస్తారా?
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:35 AM
ప్రతి నెల నిర్వహించే అంగన్‌వాడీ ప్రాజెక్టు సమావేశం బుధవారం స్థానిక ఎన్జీహోం కార్యాలయంలో ఐసీడీఎస్ పీవో రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది.
అంగన్‌వాడీ కార్యకర్తలపై ఐసీడీఎస్ పీవో రాజేశ్వరి ఆగ్రహం
యూనియన్ నాయకులకు మెమోలు జారీ చేస్తామని హెచ్చరిక
గజపతినగరం, జూలై 15(ఆంధ్రజ్యోతి): ప్రతి నెల నిర్వహించే అంగన్‌వాడీ ప్రాజెక్టు సమావేశం బుధవారం స్థానిక ఎన్జీహోం కార్యాలయంలో ఐసీడీఎస్ పీవో రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో పాల్గొన్న అంగన్‌వాడీ యూనియన్ నాయకులు మధ్యాహ్న భోజన సమయంలో సమావేశపు గదిలోనే ఈనెల 31న కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ప్రదర్శించారు. వారితో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు కరపత్రాలను ప్రదర్శించారు. ప్రాజెక్టు మీటింగ్‌లో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు యూనియన్ తరపున కరపత్రాలు ప్రదర్శించడం ఏమిటని పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పాల్పడిన యూనియ న్ నాయకులకు మెమోలు జారీ చేస్తామని ఆమె హెచ్చరించారు.