Will It Get Back on Track at Least Now? ఇకనైనా గాడిలో పడేనా?
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:38 PM
Will It Get Back on Track at Least Now? పార్వతీపురం ఐటీడీఏలో ప్రక్షాళన మొదలైంది. దశా బ్దాలుగా ఒకే కార్యాలయంలో ఉండి విధులు నిర్వహిస్తున్న కొంతమందికి స్థాన చలనం కల్పించారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి.. ఒకే చోట కొనసాగుతున్న వారి కుర్చీలను మార్చారు. ఈ మేరకు పలువురిని బదిలీ చేస్తూ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఏడుగురికి స్థాన చలనం
వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు
పార్వతీపురం, ఏప్రిల్18(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏలో ప్రక్షాళన మొదలైంది. దశా బ్దాలుగా ఒకే కార్యాలయంలో ఉండి విధులు నిర్వహిస్తున్న కొంతమందికి స్థాన చలనం కల్పించారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి.. ఒకే చోట కొనసాగుతున్న వారి కుర్చీలను మార్చారు. ఈ మేరకు పలువురిని బదిలీ చేస్తూ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వాస్తవంగా ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న కొంతమంది అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పైసలు ఇస్తేగాని కొన్ని విభాగాల్లో ఫైల్ కదలదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రక్షాళన దిశగా ఇన్‌చార్జి పీవో చర్యలు చేపట్టారు. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులను మరో విభాగానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే విధుల్లో చేరాలన్నారు. అయితే ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ గాడిలో పడేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బదిలీలు ఇలా..
- గిరిజన విద్యాశాఖ కార్యాలయం ఏ సెక్షన్‌లోని సీనియర్ అసిస్టెంట్ ఆర్.శ్రీధర్‌ను గిరిజన ఇంజనీరింగ్ కార్యాలయానికి బదిలీ చేశారు.
- పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలోని డిప్యూటీ డీఈవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హేమకుమార్‌ను గిరిజన విద్యాశాఖ ఏ సెక్షన్‌క బదిలీ చేశారు.
- గిరిజన విద్యాశాఖ ఈ-సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్ కె.ప్రమీలను ఐటీడీఏ విభాగం ఏ-వన్ సెక్షన్‌కు స్థానచలనం కల్పించారు.
- ఐటీడీఏ విభాగంలో ఏ-ఫోర్ సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్ శారదను గిరిజన విద్యాశాఖ సి-సెక్షన్‌కు మార్చారు.
- ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం అడ్మిన్ సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్ ఎస్.మణికంఠను గిరిజన విద్యాశాఖలో డీ-సెక్షన్‌కు బదిలీ చేశారు.
- గిరిజన విద్యాశాఖ కార్యాలయంలో సీ-సెక్షన్‌లో టైపిస్ట్ పి.హిమబిందును ఇన్‌చార్జి పీవో కార్యాలయం ఏ-4 సెక్షన్‌కు మార్చారు.
- గిరిజన విద్యాశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పి.పద్మజా గురుకుల కార్యాలయ సెల్‌కు బదిలీ చేశారు.