Pineapple పైనాపిల్‌కు మద్దతుధర కల్పిస్తాం
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:43 PM
Will Ensure a Support Price for Pineapple గిరిజనులు పండిస్తున్న పైనాపిల్‌కు మద్దతు ధర కల్పిస్తామని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. బుధవారం కుడ్డపల్లి జంక్షన్ వద్ద పైనాపిల్ విక్రయిస్తున్న గిరిజన రైతులతో ఆయన మాట్లాడారు.
సీతంపేట రూరల్, జూలై8(ఆంధ్రజ్యోతి): గిరిజనులు పండిస్తున్న పైనాపిల్‌కు మద్దతు ధర కల్పిస్తామని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. బుధవారం కుడ్డపల్లి జంక్షన్ వద్ద పైనాపిల్ విక్రయిస్తున్న గిరిజన రైతులతో ఆయన మాట్లాడారు. పండు ధర, రోజువారి అమ్మకాలు, మార్కెటింగ్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రధాన నగరాల్లోని రైతుబజార్లలో పైనాపిల్ విక్రయించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిరిజన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడం ద్వారా మెరుగైన ఆదాయం పొందొచ్చని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పైనాపిల్ సాగును మరింత ప్రోత్సహించేందుకు కృషిచేస్తామన్నారు.