Share News

Wild Elephant గున్న ఏనుగు సంచారం

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:24 PM

Wild Elephant on the Prowl భామిని మండలంలో ఓ గున్న ఏనుగు ప్రవేశించింది. కాట్రగడ, పక్కుడిభద్ర ప్రాంతంలో అది సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందు తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన గున్న ఏనుగు సారా, బడింగ మీదుగా వంశధార నది దాటి కాట్రగడ వైపు ఉన్న జీడితోటల్లో తిష్ఠ వేసింది.

Wild Elephant  గున్న ఏనుగు సంచారం
పక్కుడిభద్ర ప్రాంతంలో సంచరిస్తున్న గున్న ఏనుగు

  • భామినిలో ఐదుకు చేరిన గజరాజుల సంఖ్య

భామిని, మార్చి2(ఆంధ్రజ్యోతి): భామిని మండలంలో ఓ గున్న ఏనుగు ప్రవేశించింది. కాట్రగడ, పక్కుడిభద్ర ప్రాంతంలో అది సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందు తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన గున్న ఏనుగు సారా, బడింగ మీదుగా వంశధార నది దాటి కాట్రగడ వైపు ఉన్న జీడితోటల్లో తిష్ఠ వేసింది. బొమ్మిక, నేరడి, పక్కుడిభద్ర, వడ్డంగి తదితర గ్రామాల ప్రజలను ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు సంతోష్‌, కేశవ అప్రమత్తం చేస్తున్నారు. ఏ సమస్య ఉన్నా 98806 11152 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా మరో నాలుగు ఏనుగుల గుంపు నేరడి, బిల్లుమడ, సింగిడి వంశధార నదీ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. వాస్త వంగా భామిని మండలంలో పది ఏనుగులు ఉండేవి. మూడేళ్ల కిందట నాలుగు గజరాజులు కాట్రగడ సమీపంలో విద్యుత్‌షాక్‌ గురై మృతి చెందాయి. మరో రెండు ఒడిశావైపు వెళ్లాయి. ప్రస్తుతం నాలుగు గజరాజులు సంచరిస్తుండగా తాజాగా మండలంలో చేరిన గున్న ఏనుగుతో వాటి సంఖ్య ఐదుకు చేరింది. ఇక పార్వతీపురం డివిజన్‌లో ఎనిమిది ఏనుగులు సంచరిస్తుండగా.. మొత్తం మీద జిల్లాలో వాటి సంఖ్య 13కి చేరింది.

Updated Date - Mar 02 , 2026 | 11:24 PM