Share News

భర్త కనిపించడం లేదని భార్య ఫిర్యాదు

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:22 AM

రేగిడి మండలం కోడిశ గ్రామానికి చెందిన కాయల శివుడు గురువారం నుంచి కనిపించడంలేదని అతని భార్య కాయల లక్ష్మి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఎండీ సల్మాన్‌ బేగ్‌ తెలిపారు.

భర్త కనిపించడం లేదని భార్య ఫిర్యాదు

రాజాం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రేగిడి మండలం కోడిశ గ్రామానికి చెందిన కాయల శివుడు గురువారం నుంచి కనిపించడంలేదని అతని భార్య కాయల లక్ష్మి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఎండీ సల్మాన్‌ బేగ్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాయల శివుడు ఆటో డ్రైవర్‌గా పని చేయడంతో పాటు పశువుల వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందు తున్నాడు. ఈనెల 8వ తేదీ ఉదయం శివుడు, అతని బంధువైన కాయల సాంబ య్యతో కలిసి పశువులను అమ్మేందుకు రాజాం వారపు సంతకు వచ్చారు. పని పూర్తయిన తర్వాత సాంబయ్య అతని ఇంటికి వెళ్లిపోయాడు. కానీ శివుడు మా త్రం ఇంటికి తిరిగి వెళ్లలేదు. అతని భార్య లక్ష్మి ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆఫ్‌ అని వచ్చిం ది. అప్పటి నుంచి ఆయన అచూకీ తెలియకపోవడంతో లక్ష్మి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ఎస్‌ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 11 , 2026 | 12:22 AM