Share News

భర్తను హత్య చేసిన భార్య అరెస్టు

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:16 AM

మండలంలోని శివరాం గ్రామానికి చెందిన కుమిలి సరస్వతి అనే మహిళను చీపురుపల్లి సీఐ జి.శంకరరావు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు గరివిడి ఎస్‌ఐ బి.లోకేశ్వరరావు తెలిపారు.

భర్తను హత్య చేసిన భార్య అరెస్టు

గరివిడి, జూలై 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని శివరాం గ్రామానికి చెందిన కుమిలి సరస్వతి అనే మహిళను చీపురుపల్లి సీఐ జి.శంకరరావు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు గరివిడి ఎస్‌ఐ బి.లోకేశ్వరరావు తెలిపారు. రెండు రోజు ల కిందట సరస్వతి తన భర్త కుమిలి సత్యంపై కర్రతో దాడిచేసి హత్య చేసిన విషయం తెలిసిందే. మృతుడి బావమరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి.. సరస్వతిని శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jul 11 , 2026 | 12:16 AM