Share News

భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్చి..

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:15 AM

నిండు గర్భిణి అయిన తన భార్యను ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్చి.. తిరిగి ద్విచక్ర వాహ నంపై వస్తుండగా కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక క్కడే మృతిచెందాడు.

భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్చి..

  • తిరిగి వస్తుండగా కారు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి

నెల్లిమర్ల, జూలై 3(ఆంధ్రజ్యోతి): నిండు గర్భిణి అయిన తన భార్యను ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్చి.. తిరిగి ద్విచక్ర వాహ నంపై వస్తుండగా కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక క్కడే మృతిచెందాడు. ఈ ఘటన నెల్లిమర్ల- చీపురుపల్లి రోడ్డులో చంపావతి వంతెన వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై నెల్లిమర్ల పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గుర్ల మండలం బెల్లానపేట గ్రామానికి చెందిన దుక్క నరసింహులు(31) తన భార్యను ప్రసవం కోసం గురువారం నెల్లిమర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చాడు. తన భార్యకు, ఆమె వద్ద ఉన్న తన పెద్దమ్మకు రాత్రి భోజనం ఏర్పాట్లు చేసి.. తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా, ఎదురుగా వస్తున్న కారు బలం గా ఢీకొట్టింది. దీంతో నరసింహులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 12:15 AM