కూటమి పాలనపై అంతటా సంతృప్తి
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:09 AM
కూటమి పాలన వచ్చి రెండేళ్లు పూర్తయిందని, ఒక్క గొడ్డలి పార్టీ వారికి తప్ప మిగతా అందరికీ ఈ ప్రభుత్వ పాలనపై పూర్తి స్థాయిలో సంతృప్తి ఉందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు చెప్పారు.
విజయనగరం రూరల్, జూలై 12(ఆంధ్రజ్యోతి): కూటమి పాలన వచ్చి రెండేళ్లు పూర్తయిందని, ఒక్క గొడ్డలి పార్టీ వారికి తప్ప మిగతా అందరికీ ఈ ప్రభుత్వ పాలనపై పూర్తి స్థాయిలో సంతృప్తి ఉందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు చెప్పారు. ఆదివారం సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం కింద ఆర్థిక ఆసరా లభించిందన్నారు. సామాజిక పింఛన్ల పెంపు, రైతులకు అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ప్రభుత్వం అందజేసిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు చేస్తున్న కృషి ఉత్తరాంధ్ర ప్రజలకు తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, కుట్రలు, విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకుల ప్రవర్తన ఉందని, వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిప్పికొట్టాలన్నారు.