Auto? ఆటోలోకి ఎందుకు ఎక్కించారో?
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:54 PM
Why Was She Taken Into the Auto? మార్గమధ్యంలో లారీ ఆపి.. యూరియా బస్తాల అక్రమ తరలింపునకు యత్నించిన ఘటన వీరఘట్టం మండలంలో చోటుచేసుకుంది. అయితే ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది.
హార్టికల్చర్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసు
వీరఘట్టం, జూన్ 13(ఆంధ్రజ్యోతి): మార్గమధ్యంలో లారీ ఆపి.. యూరియా బస్తాల అక్రమ తరలింపునకు యత్నించిన ఘటన వీరఘట్టం మండలంలో చోటుచేసుకుంది. అయితే ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో ఖరీఫ్ రైతులకు యూరియా సరఫరా చేసేందుకు శనివారం విశాఖ పోర్టు నుంచి 26 టన్నుల లోడ్‌తో ఓ లారీ బయల్దేరింది. ఈ యూరియా మొత్తం కంబర, చిట్టిపూడివలస సచివాలయాలకు చేరాల్సి ఉంది. అయితే వీరఘట్టానికి సమీపంలో లారీని ఆపి.. అందులోంచి 20 బస్తాలను ఆటోలో ఎక్కించారు. దీనిని గమనించిన స్థానికులు ఫొటోలు తీసి.. వీరఘట్టం వ్యవసాయాధికారులకు పంపించారు. దీంతో వారు అప్రమత్తమై ఉన్నతాఽధికారులకు విషయం చేరవేశారు. కాగా విషయం బయటకు రావడంతో యూరియా బస్తాలతో ఉన్న ఆటోను కంబర సచివాలయానికి తరలించారు. మరోవైపు పాలకొండ ఏడీఏ రత్నకుమారి, వీరఘట్టం ఏవో సౌజన్యతో కలిసి హుటాహుటిన కంబర, చిట్టిపుడివలస సచివాలయాలకు చేరుకుని నిల్వలు పరిశీలించారు. లెక్క సరిపోవడంతో మార్గమధ్యంలో లారీ నుంచి ఆటోలోకి యూరియా బస్తాలు ఎందుకు ఎక్కించారానే దానిపై కంబర సచివాలయం వద్ద వారు తీశారు. హార్టికల్చర్ అసిస్టెంట్ ఉదయభాను సూచన మేరకు ఇలా చేశామని లారీ డ్రైవర్ చెప్పారు. దీంతో సంబంధిత హార్టికల్చర్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసు అందించామని ఏవో తెలిపారు. రెండు సచివాలయాల్లో నిల్వలు సరిపోయాయన్నారు. ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా మాత్రమే రైతులకు యూరియా అందజేయాల్సి ఉందని తెలిపారు.