జిందాల్ మోసాలపై మౌనమెందుకు?
ABN , Publish Date - May 04 , 2026 | 12:16 AM
బొడ్డవర ప్రాంతంలో జిందాల్ పరిశ్రమ చేస్తున్న భూ దోపిడీలు, డీపట్టా భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆధారాలతో సహా చూపిస్తున్నా అధికారులు ఎందుకు మౌనం వహి స్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురా జు ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ రఘురాజు
ఎస్.కోట రూరల్, మే 3(ఆంధ్రజ్యోతి): బొడ్డవర ప్రాంతంలో జిందాల్ పరిశ్రమ చేస్తున్న భూ దోపిడీలు, డీపట్టా భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆధారాలతో సహా చూపిస్తున్నా అధికారులు ఎందుకు మౌనం వహి స్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురా జు ప్రశ్నించారు. ఆదివారం బొడ్డవర గ్రామంలోని తన స్వగృహంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి.. మాట్లాడారు. జిందాల్ యాజమాన్యం వద్ద ఎంతభూమి ఉందో సర్వేచేసి చెప్పా లని ఎన్నో నెలలుగా కోరుతున్నా అధికార యంత్రాంగం చెప్పడం లేదన్నారు. ప్రభుత్వ అధికారుల అండదండలతో డీపట్టాలు కాస్తా జిరాయితీలుగా మారి రిజిస్ట్రేషన్లు జరిగాయని తాము ఆధారాలతో చూపించినా కలెక్టర్ ఎందుకు స్పం దించలేదని ప్రశ్నించారు. అదేవిధంగా మిలటరీ పట్టాల పేరుతో సంబంధిత వ్యక్తులు ఎటువంటి ధ్రువపత్రాలు ఇవ్వకపోయినా వారికి అధిక మొత్తంలో పరి హారం అందిందని, ఇందులో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. జాతీ య ఎస్టీ కమిషన్ సభ్యుడు జర్రోతు హుస్సేన్ నాయక్ విచారణకు రావాలని ఆదే శాల మేరకు హైదరాబాద్‌లో రైతులతో తాను విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ విచారణకు ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఎస్పీని హాజరు కావాలని కమిషన్ సమన్లు పంపిందన్నారు.