Share News

లీజు వసూలులో నిర్లక్ష్యమెందుకు?

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:02 AM

మడ్డువలస రిజర్వా యర్‌లో చేపలవేటకు సంబంధించి గత పాలకవర్గం నుంచి లీజు సొమ్ము వసూలు చేయడంలో సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యం వహించారని సీతారామా స్వదేశీ మత్స్యకార సభ్యులు ధ్వజమెత్తారు.

లీజు వసూలులో నిర్లక్ష్యమెందుకు?
ఎఫ్‌డీవోను ప్రశ్నిస్తున్న సంఘ సభ్యులు

  • ధ్వజమెత్తిన స్వదేశీ మత్స్యకార సభ్యులు

వంగర , మార్చి 9(ఆంధ్రజ్యోతి): మడ్డువలస రిజర్వా యర్‌లో చేపలవేటకు సంబంధించి గత పాలకవర్గం నుంచి లీజు సొమ్ము వసూలు చేయడంలో సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యం వహించారని సీతారామా స్వదేశీ మత్స్యకార సభ్యులు ధ్వజమెత్తారు. సోమవారం మగ్గూరు మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో సొసైటీ అధ్యక్షుడు దుర్గారావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా పటువర్ధనం, శ్రీహరిపురం, సంగాంకు చెందిన సభ్యులు రామారావు, దుర్గారావు, సింహాలుతో పాటు పలువురు.. ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ను నిలదీశారు. గత పాలకవర్గం నుంచి నాలుగు ఫసలీల కు చెందిన సుమారు రూ.57లక్షల బకాయిలు వసూలు చేయకుండా ఎందుకు మౌనం ప్రదర్శించాల్సి వచ్చింద ని ప్రశ్నించారు. అలాగే మడ్డువలస రిజర్వాయర్‌ ప్రధా న గేట్లు మరమ్మతుల పేరుతో రిజర్వాయర్‌లో నీరు పూర్తిగా బయటకు తీసినపుడు కోట్ల రూపాయలు విలువ చేసే మత్స్యసంపద, అంతర్రాష్ట్ర వేటగాళ్లతో చేపలవేట సాగించి వచ్చిన మత్స్యసంపద ఎటు తరలిపోయిందని ప్రశ్నించారు. మత్య్స సంపద అమ్మకా లు చేసి, లీజులు చెల్లిస్తామని చెప్పిన అధికారులు, అప్పటి పాలకవర్గ సభ్యులు ఎందుకు లీజులు చెల్లించ లేదని మండిపడ్డారు. దీనికి ఎఫ్‌డీవో మౌనం ప్రదర్శిం చారు. 1431, 1432, 1433, 1434 ఫసలీలకు చెందిన రూ.57లక్షల సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాలని అధికా రి చెప్పగా.. 1434 చెందిన రూ.18లక్షల సొమ్ము చెల్లిం చి, వేట సాగిస్తామని సభ్యులు తీర్మానించారు. ఈ విష యంపై అధికారులకు తెలియజేస్తానని ఎఫ్‌డీవో తెలిపారు.

నిబంధనలు ఇలా..

మడ్డువలస రిజర్వాయర్‌లో మత్స్యకారులు వేట సాగించాలంటే లీజు కట్టనిదే అధికారులు అనుమతులు ఇవ్వరాదు. అదేవిధంగా లీజు సొమ్ము చెల్లించడంలో సంఘాలకు ఒకే ఏడాది వెసులుబాటు ఉంటుంది. లీజు కట్టించుకోవటంలో పాతబకాయిలు ఉండగా కొత్తలీజు కట్టించుకునేందుకు నిబంధనలు వర్తించవు. గతంలో పనిచేసిన ఎఫ్‌డీవో 1428 ఫసలీ బకాయిలు ఉంటుండగా 1429 ఫసలీ కట్టించుకోవటం తో ఆయన సస్పెండ్‌ అయ్యారు. ఇప్పుడు కొత్త పాలకవ ర్గం గత బకాయిలు (1431, 1432, 1433 ఫసలీల బకాయిలు) చెల్లించకుండా 1434కు చెందిన రూ.18 లక్షలు చెల్లించి, వేట సాగించటానికి తీర్మానించింది. అయితే ఇది సాధ్యం కాదని అధికారులు చెప్పకుండా అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:02 AM