Share News

వంద రోజుల పని కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం?

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:26 AM

జాబ్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ వంద రోజులు పని దినాలను కల్పిం చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ క్షేత్ర సహా యకులు ఎందుకు విఫలం అవుతున్నారని రాజాం క్లస్టర్‌ ఏపీడీ పి.చంద్రకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వంద రోజుల పని కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం?

  • ఉపాధి రాజాం క్లస్టర్‌ ఏపీడీ చంద్రకుమారి

  • సోషల్‌ ఆడిట్‌ ప్రజావేదికలో వెలుగుచూసిన అక్రమాలు

బొండపల్లి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): జాబ్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ వంద రోజులు పని దినాలను కల్పిం చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ క్షేత్ర సహా యకులు ఎందుకు విఫలం అవుతున్నారని రాజాం క్లస్టర్‌ ఏపీడీ పి.చంద్రకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి 19వ విడత సోషల్‌ ఆడిట్‌ ప్రజావేదికను మంగళవారం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎక్కడా కూడా ప్రథమ చికిత్స కిట్లతోపాటు నీరు, నీడ సౌకర్యాలు లేనట్లుగా గుర్తించినట్టు సోషల్‌ ఆడిట్‌ డీఆర్‌పీలు ప్రజావేదిక దృష్టికి తీసుకువచ్చారు. కొండకిండాం ఫీల్డ్‌అసిస్టెంట్‌ పతివాడ చిన్నతల్లి 11 రోజులపాటు ఉపాధి పనులకు వెళ్లినట్లుగా మస్తర్లు వేసుకుని రూ.2474 డ్రా చేసు కున్నట్టు గుర్తించారు. చిన్నతామరాపల్లిలో రోడ్లకు ఇరు వైపులా 160 మొక్కలను నాటగా, ప్రస్తుతం ఆరు మొ క్కలు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు. పని ప్రదేశా ల్లో పనుల వివరాలు, ఖర్చు చేసిన మొత్తం తెలిపే బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ఏపీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గజపతినగరం క్లస్టర్‌ ఏపీడీ కె.రమామ ణి, అంబుట్స్‌మన్‌ ఉపాధి అధికారి యాకూబ్‌ భాషా, డీవీవీవో వెంకటరమణ, ఎంపీపీ చల్లా చలంనాయుడు, ఎంపీడీవో ఎ.రఘుపతిరావు, ఏపీవోలు కె.అరుణకు మారి, బొడ్డు కృష్ణవేణి పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 12:26 AM