Share News

Why the danger.. there is a trick అపాయం ఎందుకు.. ఉపాయం ఉందిగా

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:14 AM

Why the danger.. there is a trick పూర్వీకులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించేవారు. నేడు 30 ఏళ్లు దాటక ముందే రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కారణం మన ఆహారంలో ఎక్కువగా వాడే మూడు పదార్థాలు. చక్కెర, ఉప్పు, తెల్లబియ్యంతో చాలా అనర్థాలని వైద్యులు చెబుతున్నారు.

Why the danger.. there is a trick అపాయం ఎందుకు.. ఉపాయం ఉందిగా

అపాయం ఎందుకు.. ఉపాయం ఉందిగా

వైట్‌ పాయిజన్స్‌తో అనారోగ్యం

తీపి-ఉప్పు-తెల్లబియ్యం.. డయాబెటిస్‌, బీపీకి మూలం

వీటికి బదులు ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలు

రుచిలో రాజీ లేకుండా ఆరోగ్యానికి తోడు

విజయనగరం రింగరోడ్డు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):

పూర్వీకులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించేవారు. నేడు 30 ఏళ్లు దాటక ముందే రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కారణం మన ఆహారంలో ఎక్కువగా వాడే మూడు పదార్థాలు. చక్కెర, ఉప్పు, తెల్లబియ్యంతో చాలా అనర్థాలని వైద్యులు చెబుతున్నారు. వీటిని వైట్‌ పాయిజన్స్‌గా పేర్కొంటున్నారు. ఉన్న రోగాలు తగ్గాలన్నా, కొత్తగా రాకుండా ఉండాలన్నా, వీటి వినియోగం తగ్గించాలంటున్నారు. అయితే నాలుకకు అలవాటైన రుచిని ఒక్కసారిగా వదిలేయడం కష్టమే. అందుకే ఆరోగ్యాన్ని కాపాడే ప్రత్యామ్నాయ మార్గాలు అవసరంగా మారాయి. అవేంటో చూద్దాం.

చక్కెర.. తీయని విషం

మన రోజువారీ జీవితంలో చక్కెర భాగమైపోయింది. టీ, కాఫీ నుంచి స్వీట్స్‌ వరకూ చక్కెర లేనిదే కుదరదు. కాని ఇందులో ఎటువంటి పోషకాలు లేవు. అధికంగా తీసుకుంటే రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిలు అస్తవ్యస్తమౌతాయి. ఆ తర్వాత డయాబెటిస్‌ మాత్రమే కాకుండా కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయ1ేు ఫ్యాటీ లివర్‌, రక్త నాళాల్లో మంట, గుండెజబ్బులు వంటి సమస్యలు తలెత్తుతాయి

ప్రత్యామ్నాయాలు ఇవే..

స్టీవీయా (మధుపత్రి) మొక్కల నుంచి తీసిన సహజ స్వీటనరీ చక్కెరకు గట్టి ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చింది. ఇందులో క్యాలరీలు సున్నా. రక్తంలో చక్కెర స్థాయిలు పెంచదు. ’ షుగర్‌ ఫ్రీ గ్రీన్‌’ వంటి ఉత్పత్తులు సురక్షిత మార్గంగా పరిగణిస్తున్నారు. పెద్ద, పెద్ద కిరాణా దుకాణాల్లో లభిస్తాయి. టీ లేదా కాఫీలో చిటికెడు వేస్తే సహజ తీపి సువాసన ఇస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడుతుంది.

ఉప్పుతో ముప్పులెన్నో..

మన వంటల్లో ఉప్పు తప్పనిసరి.. సాఽధారణంగా ఉప్పులో సోడియం అధికంగా ఉండడం వల్ల శరీరంలో నీటి శాతం పెరిగి రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. బీపీ 150-160 దాటితే అత్యంత ప్రమాదకరం. దీనివల్ల పక్షవాతం, కిడ్నీలు దెబ్బతినడం, గుండెపోటు వంటి సమస్యలకు ఇది ప్రధాన కారణం.

ప్రత్యామ్నాయాలు ఇవే

లో-సోడియం సాల్ట్‌ (ఓ- సాల్ట్‌): సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా దీంట్లో ఉండడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే కిడ్నీ సమస్యలు వున్నవారు లేదా కొన్ని బీపీ మందులు వాడే వారు లో-సోడియం సాల్ట్‌ వాడే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి. అలాగే వేయించిన వెళ్లుళ్లి పొడిని ఉప్పుకి బదులుగా వాడుకోవచ్చు. కూర చివరలో నిమ్మరసం కలిపితే రుచికి లోటుండదు.

ఫ జీలకర్ర, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి ఉప్పుకు సమానమైన రుచిని ఇస్తుంది. ఉప్పు తక్కువగా వున్నా భోజనం రుచిగా ఉంటుంది.

తెల్లబియ్యంతో రోగాలకు ఆహ్వానం

పాలిస్‌ పెరిగే కొద్దీ తెల్లబియ్యంలో మనకు మేలు చేసే ’ తౌడు’ పీచు ( ఫైబర్‌) పూర్తిగా నశించి పోతాయి. మిగిలేది కేవలం పిండి పదార్థమే. ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బొజ్జ పెరగడానికి, స్థూలకాయానికి దారితీస్తుంది.

ప్రత్యామ్నాయాలు ఇవే

బ్రౌన్‌ రైస్‌/ దంపుడు బియ్యం: ఇందులో పీచు అధికంగా ఉండి చక్కెర నిదానంగా రక్తంలో చేరుతుంది. బీపీ, షుగర్‌ నియంత్రణకు సహాయ పడుతుంది. విటమిన్‌ బీ-1, బీ-3, బీ-6, మెగ్నీషియం పుస్కలంగా ఉంటాయి.

నూనెతో రోగాలు ఎన్నో

మనం సాఽధారణంగా వాడే సన్‌ఫ్లవర్‌, సోయా, పామాయిల్‌ ఎక్కువగా ప్రాసెస్‌ అయినవే. ఎక్కువగా వాడితే గుండెజబ్బులు, ఇన్‌ఫ్లామేషన్‌ ప్రమాదం వుంది. ఒకే నూనెను మళ్లీ, మళ్లీ వేడిచేస్తే విష పదార్థాలు ఏర్పడి క్యాన్సర్‌, గుండె జబ్బులకు కారణమౌతుంది.

ప్రత్యామ్నాయాలు ఇవే

గానుగ నూనెలైన నువ్వుల నూనె, ఆవాలు నూనె, వేరుశెనగ నూనె తదితర సాంప్రదాయ నూనెలు కూరలు, వేపుళ్లకు మితంగా వాడితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ఈ నూనెల్లో సహజ. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తూ జీర్ణక్రియకు సాయపడతాయి. రిఫైండ్‌ నూనెతో పోల్చితే హానికర పదార్థాలు తక్కువని వైద్యులు చెబుతున్నారు.

అలవాట్లే అసలు మార్పు

కేవలం ఆహారపదార్థాలు మార్చితే సరిపోదు. మన రుచి అలవాట్లను మార్చుకోవాలి. తక్కువ పరిమాణంలో ఉప్పు, తీపి, నూనె కలిగిన ఆహారానికి నాలుక అలవాటు పడడానికి కనీసం 2 లేదా 3 నెలలు పడుతుంది. ఒకసారి ఆ మార్పు వచ్చాక సహజ రుచులే అమృతంలా అన్పిస్తాయి. అంతేకాక బీపీ, మధుమేహం వంటి వ్యాధులు నియంత్రణలోకి వస్తాయి. ఇప్పటి వరకూ ఎలాంటి సమస్యలు లేనివారిలో ఈ రోగాలు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ ఆహారాలను అలవాటు చేసుకోవాలి

డాక్టరు ఎం.ఆనందరావు, ఎండీ, ఆయుర్వేదం, ఆయుష్‌ శాఖ, విజయనగరం

కేవలం నాలుక రుచికోసం చక్కెర, ఉప్పు, తెల్లబియ్యం, అఽధిక నూనెల వినియోగానికి అలవాటు పడి శరీరాన్ని లోలోపలే జబ్బులతో గుల్ల చేసుకోవడం కంటే వాటి స్థానంలో సురక్షితమైన ప్రత్యామ్నా యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని అనుసరించి ముందుగా వైద్య నిపుణుల సూచనలతోనే మార్పులు ప్రారంభించాలి. ముఖ్యంగా లో-సోడియం ఉప్పు లేదా నూనెల వినియోగంలో జాగ్రత్తలు అవసరం.

Updated Date - Apr 15 , 2026 | 12:14 AM