Share News

That School? ఆ పాఠశాలలోనే ఎందుకిలా..?

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:49 PM

Why Is This Happening at That School? కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వరుస ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. గత ఏడాది అక్టోబరు నెలలో.. ఇదే పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థినులు జాండీస్‌ లక్షణాలతో తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. అప్పట్లో పార్వతీపురం, విశాఖపట్నంలో వైద్యసేవలు అందించారు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అప్పట్లో ప్రిన్సిపాల్‌తో పాటు కొంతమంది సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

 That School? ఆ పాఠశాలలోనే ఎందుకిలా..?
కురుపాం గురుకుల పాఠశాల

  • అప్పట్లో ఇద్దరి మృతి

  • పదుల సంఖ్యలో బాధపడిన విద్యార్థినులు

  • అయినా అప్రమత్తం కాని పాఠశాల సిబ్బంది

పార్వతీపురం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వరుస ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. గత ఏడాది అక్టోబరు నెలలో.. ఇదే పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థినులు జాండీస్‌ లక్షణాలతో తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. అప్పట్లో పార్వతీపురం, విశాఖపట్నంలో వైద్యసేవలు అందించారు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అప్పట్లో ప్రిన్సిపాల్‌తో పాటు కొంతమంది సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. ఇన్‌చార్జి డీడీని తక్షణమే మార్పు చేశారు. ఆస్థానంలో కొత్త డీడీని నియమించారు. అయినా ఆ పాఠశాలలో పరిస్థితి మారలేదు. తాజా ఘటనతో మరోసారి అధికారులు ఉలిక్కిపడ్డారు. పర్యవేక్షణ లోపమే ఈ పరిస్థితికి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

- వాస్తవంగా వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న బాలికలను సకాలంలో గుర్తించి.. వారికి ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత పాఠశాల పర్యవేక్షకులతో పాటు వైద్య సిబ్బందిపై ఉంది. అయితే జ్వరాలతో బాధపడుతున్న వారిని మిగతా బాలికలతో కలిపి ఒకే గదిలో ఉంచినట్లు తెలిసింది.. దీంతో వైరల్‌ ఫీవర్లు వ్యాపించాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ పాఠశాలలో అదనపు భవన నిర్మాణాలు పూర్తికాకపోవడం కూడా ఈ పరిస్థితికి మరో కారణంగా తెలుస్తోంది. గత ఏడాది జరిగిన సంఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు భవన నిర్మాణాలు పూర్తి చేయాలని అప్పట్లో ఆదేశించారు. కానీ ఆ పనులు నేటికీ పూర్తికాలేదు. దీంతో విద్యార్థినులకు వసతి సమస్య వేధిస్తోంది. అందర్నీ ఒకే చోట ఉంచాల్సి వస్తోంది.

- గిరిజన విద్యాశాఖకు పూర్తిస్థాయి డీడీ లేరు. గతంలో డీడీగా పనిచేసిన విజయశాంతి బదిలీపై వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇన్‌చార్జి డీడీగా ఏపీవో మురళీధర్‌ వ్యవహరిస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో పార్వతీపురం ఐటీడీఏకు పూర్తిస్థాయి డీడీని నియమించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:49 PM