Why do patients have to wait so long? రోగులు అంతసేపు నిరీక్షించడమేంటి?
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:21 AM
Why do patients have to wait so long? వైద్యం కోసం వచ్చే రోగులు అంతసేపు నిరీక్షించడం ఏమిటి? కూర్చొనే సదుపాయం కల్పించలేరా? పారిశుధ్యం సరిగా లేదు. ఆస్పత్రి ఆవరణంలో వర్షపు నీరు ఉండిపోవడం బాగాలేదు అంటూ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోగులు అంతసేపు నిరీక్షించడమేంటి?
శానిటేషన్ సరిగా లేదు
వర్షపు నీరు నిలిచిపోవడం బాగాలే
బాడంగి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
బాడంగి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): వైద్యం కోసం వచ్చే రోగులు అంతసేపు నిరీక్షించడం ఏమిటి? కూర్చొనే సదుపాయం కల్పించలేరా? పారిశుధ్యం సరిగా లేదు. ఆస్పత్రి ఆవరణంలో వర్షపు నీరు ఉండిపోవడం బాగాలేదు అంటూ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాడంగి సామాజిక ఆసుపత్రిని మంగళవారం ఉదయం ఆయన తనిఖీ చేశారు. తొలుత ఓపీని పరిశీలించారు. రోగులు నిరీక్షిస్తుండడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు వేచి చూడడం పద్ధతి కాదని, వారికి మౌలిక వసతులు కల్పించాలని వైద్యులకు ఆదేశించారు. రోగుల వద్దకు వెళ్లి వారితోనూ మాట్లాడారు. అనంతరం ఆసుపత్రిలో శానిటేషన్ పరిస్థితి చూసి అసహనం వ్యక్తం చేశారు. పారిశుధ్య చర్యలు సరిగా లేవన్నారు. శానిటేషన్ సిబ్బంది ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. దీనిపై డాక్టర్లు మాట్లాడుతూ 30 పడకలు ఉన్నప్పుడు ఐదుగురు ఉన్నారని, 50 పడకలుగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ ఐదుగురే కొనసాగుతున్నారని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మరో ఐదుగురిని నియమించాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి పరిసరాలను చూసి వర్షపునీరు నిలవడం ఏమిటీని ప్రశ్నించారు. యుద్ధప్రాతిపదికన డ్రైన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ విషయమై ఎంపీడీవో రామకృష్ణతో మాట్లాడి డాక్టర్లకు సహకరించి తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధి నిధులతో ఆసుపత్రి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి ప్రధాన వైద్యుడు నాగేశ్వరరావు, ఇతర వైద్యులు, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ వచ్చి వెళ్లాక డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీ కూడా ఆసుపత్రిని పరిశీలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.