Share News

డిప్యూటీ సీఎంను నిందించడం ఎందుకు?

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:08 AM

కాపు కులానికి చెందిన వ్యక్తి మరణిస్తే వవైసీపీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ఎందుకు నిందిస్తున్నారో అర్థం కావడం లేదని రాష్ట్ర గిరిసన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యా రాణి అన్నారు.

 డిప్యూటీ సీఎంను నిందించడం ఎందుకు?
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): కాపు కులానికి చెందిన వ్యక్తి మరణిస్తే వవైసీపీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ఎందుకు నిందిస్తున్నారో అర్థం కావడం లేదని రాష్ట్ర గిరిసన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యా రాణి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర హోం మంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. బొట్టు, కాటుక లేకుండా మీ ఇంట్లో మహిళలు బయటకు వస్తున్నారా అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రెండో పెళ్లి చేసుకుంటే తప్పా అని నిలదీశారు. మగవారికి ఒక న్యాయం, ఆడవారికి మరో న్యాయమా అని అడిగారు. మహిళల కోసం అసభ్యకరంగా మాట్లాడటం వారికి తగద న్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ రెండేళ్లలో జరిగా యన్నారు. వాటిని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను కోరారు. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే వారిని ఉపేక్షించవద్దని క్యాడర్‌కు సూచించారు. అలాంటి వారిని సమావేశాలకు రానివ్వవద్దన్నారు. అలాగే ఓటరు జాబితా సమగ్ర సవరణపై ప్రతీ ఒక్కరూ దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, గుళ్ల వేణుగోపాలనాయుడు, ఆముదాల పరమేశు, యుగంధర్‌, వెంకటరమణ, ముఖీ సూర్యనారాయణ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:08 AM