Share News

Why Are They Doing This? ఇలా ఎందుకు చేస్తున్నారో?

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:42 PM

Why Are They Doing This? పార్వతీపురం పట్టణంలోని నెల్లిచెరువు ప్రాంతాన్ని డంపింగ్‌యార్డు వ్యర్థాలతో కప్పేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. అయితే భవిష్యత్‌ అవసరాల కోసమే ఇదంతా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Why Are They Doing This? ఇలా ఎందుకు చేస్తున్నారో?
డంపింగ్‌యార్డు తెచ్చిన వ్యర్థాలతో చెరువును కప్పేస్తున్న దృశ్యం

  • సర్వత్రా విమర్శల వెల్లువ

పార్వతీపురం, ఫిబ్రవరి28(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పట్టణంలోని నెల్లిచెరువు ప్రాంతాన్ని డంపింగ్‌యార్డు వ్యర్థాలతో కప్పేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. అయితే భవిష్యత్‌ అవసరాల కోసమే ఇదంతా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ప్రభుత్వ అవసరాల కోసమైతే గ్రావెల్‌ లేదా ఇతర మెటీరియల్‌తో ఆ ప్రాంతాన్ని ఫిల్లింగ్‌ చేయాల్సి ఉంది. అయితే అలా కాకుండా డంపింగ్‌యార్డు నుంచి తీసుకొచ్చిన వ్యర్థాలతో చెరువు ప్రాంతాన్ని కప్పేస్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వ్యర్థాల నుంచి దుర్వాసన వెలువడడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని జిల్లాకేంద్ర వాసులు కోరుతున్నారు.

Updated Date - Feb 28 , 2026 | 11:42 PM