Who will get the ZP Chair? జడ్పీ చైర్ ఎవరిదో?
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:23 AM
Who will get the ZP Chair? జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక దగ్గర పడుతోంది. ఈ నెల 20న జరగనుంది. మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంతవరకూ అభ్యర్థి ఎంపికపై స్పష్టత రాలేదు. జిల్లా వ్యాప్తంగా 27 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 22 స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది.
జడ్పీ చైర్ ఎవరిదో?
చైర్‌పర్సన్ పదవిపై పెద్ద నేతల ఆశలు
కుమార్తెల కోసం గట్టి ప్రయత్నాలు
రేసులో సిరిసహస్ర, డాక్టర్ కర్రోతు చంద్రకళ
విజయనగరం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక దగ్గర పడుతోంది. ఈ నెల 20న జరగనుంది. మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంతవరకూ అభ్యర్థి ఎంపికపై స్పష్టత రాలేదు. జిల్లా వ్యాప్తంగా 27 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 22 స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. 5 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమైంది. అయితే జడ్పీ చైర్‌పర్సన్ పదవి ఎవరిని వరిస్తుందోనన్న చర్చ వాడీవేడిగా నడుస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీలో టీడీపీకి కేటాయిస్తారా? జనసేనకు కేటాయిస్తారా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఎందుకంటే విజయనగరం మేయర్ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. జనసేన జడ్పీ అడుగుతోందన్న ప్రచారం జరుగుతోంది.
హామీతోనే రంగంలోకి దిగారా?
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బీసీ మహిళకు కేటాయించారు. ప్రముఖంగా మజ్జి సిరి సహస్ర పేరు వినిపిస్తోంది. ఈమె జడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె. తెర్లాం జడ్పీటీసీగా గెలిచారు. స్థానిక ఎన్నికల ముందు చిన్నశ్రీను వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. గతంలో వైసీపీలో క్రియాశీలక నేత కావడం, జడ్పీ చైర్మన్‌గా వ్యవహరించడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలపై ఆయనకు పట్టు ఉంది. అయితే కుమార్తెకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ హామీతోనే ఆయన టీడీపీలో చేరారన్నది పరిశీలకుల అభిప్రాయం.
త్యాగాన్ని గుర్తించాలని..
భోగాపురం జడ్పీటీసీగా గెలిచిన కర్రోతు చంద్రకళ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు కుమార్తె. విద్యావేత్తగా మంచి గుర్తింపు పొందారు. వాస్తవానికి గత ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న బంగార్రాజు కూటమి సమీకరణాల్లో భాగంగా జనసేనకు నెల్లిమర్ల నియోజకవర్గాన్ని కేటాయించడంతో నిరాశ చెందారు. దీనికి ప్రతిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఇచ్చింది. అయితే ఆయన పెద్దగా సంతృప్తి చందలేదు. తన కుమార్తె చంద్రకళకు జడ్పీ చైర్‌పర్సన్ ఇవ్వాలని కోరుతున్నారు. సిరి సహస్రకు ఇప్పటికే ఖరారైందని కొందరు చెప్పుకొస్తున్నారు. చివరకు ఎవరి వైపు మొగ్గుచూపుతారో అన్నది చూడాలి.
ఈనెల 19న జడ్పీ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో నేడో రేపో టీడీపీ అధిష్ఠానం పేరును ప్రకటించనుంది. ఎవరిపేరును ప్రకటిస్తారోనని, జిల్లా అంతాట ఉత్కంఠతో ఎదురుచూస్తోంది
============