Share News

Who was the first leader of Rajam? రాజాం తొలి సారధి ఎవరు?

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:16 AM

Who was the first leader of Rajam? రెండో విడత ఎన్నికల్లో రాజాం నగర పంచాయతీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో మొదటి చైర్మన్‌ ఎవరన్న చర్చ స్థానికంగా సాగుతోంది. సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలకు వెళ్లడంతో అందరిలో కాస్త ఉత్కంఠ నెలకొంది. సారధిగా ఎవరుంటే మంచిదంటూ పురవాసులు మాట్లాడుకుంటున్నారు. ముగ్గురు నేతలు టికెట్‌ ఆశిస్తున్నారు. రాజాం మునిసిపాల్టీకి సంబంధించి ఎన్నికల నిర్వహణకు అన్ని అడ్డంకులు తొలగిపోయాక అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

Who was the first leader of Rajam? రాజాం తొలి సారధి ఎవరు?
రాజాం మున్సిపల్‌ కార్యాలయం

రాజాం తొలి సారధి ఎవరు?

మునిసిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

రెండో విడతలో నిర్వహణకు సన్నాహాలు

కూటమి తరుపున చైర్మన్‌ పదవి జనసేనకు కేటాయింపు

టికెట్‌ ఆశిస్తున్న ముగ్గురు

రాజాం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):

రెండో విడత ఎన్నికల్లో రాజాం నగర పంచాయతీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో మొదటి చైర్మన్‌ ఎవరన్న చర్చ స్థానికంగా సాగుతోంది. సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలకు వెళ్లడంతో అందరిలో కాస్త ఉత్కంఠ నెలకొంది. సారధిగా ఎవరుంటే మంచిదంటూ పురవాసులు మాట్లాడుకుంటున్నారు. ముగ్గురు నేతలు టికెట్‌ ఆశిస్తున్నారు. రాజాం మునిసిపాల్టీకి సంబంధించి ఎన్నికల నిర్వహణకు అన్ని అడ్డంకులు తొలగిపోయాక అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. వార్డుల విభజన సైతం పూర్తయ్యింది. 24 వార్డులు ఉండగా విభజనతో వాటి సంఖ్య 32కు చేరింది. రాజాం మునిసిపాల్టీకి రెండో విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించారు. నవంబరు మూడో వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. డిసెంబరు మొదటి వారంలో పోలింగ్‌ జరగవచ్చు. కూటమి తరుపున మునిసిపల్‌ చైర్మన్‌ పదవిని జనసేనకు కేటాయించారు. దీంతో ఎవరికి ఛాన్స్‌ దక్కుతుందోనన్న చర్చ నడుస్తోంది. అయితే బలమైన అభ్యర్థిని బరిలో దించి రాజాం మునిసిపాల్టీపై తొలిసారిగా కూటమి జెండా ఎగురవేయాలన్న కృతనిశ్చయంతో మూడు పార్టీలు ఉన్నాయి.

ఆ ముగ్గురు పేర్లతో..

జనసేన నుంచి ప్రధానంగా ముగ్గురు ఆశావహులు ఉన్నారు. ముఖ్యంగా జనసేన సమన్వయకర్త పొగిరి సురేష్‌బాబు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. తన కుటుంబసభ్యులకు ఛాన్స్‌ ఇస్తారని భావిస్తున్నారు. గతంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. కుమార్తె దీపికకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మీసాల హేమలత, గార వసంతికుమారి పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురు పేర్లతో ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తుండడం విశేషం. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావడంతో వీరు పోటీదారులుగా ఉన్నారు. అయితే కూటమి పార్టీలకు చెందిన వారు, పట్టణ ప్రముఖులు, తటస్థులు జనసేనలో చేరి చైర్‌పర్సన్‌ టిక్కెట్‌ పొందేందుకు తెర వెనుక ప్రయత్నాలు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది.

టీడీపీ మౌనంగా..

తెలుగుదేశం పార్టీ శ్రేణులు హైకమాండ్‌ నిర్ణయంపై మౌనం వహిస్తున్నారు. గతంలో రాజాం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని జనసేనకు కేటాయించిన సమయంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. దీంతో అప్పట్లో టీడీపీకి ఖరారు చేశారు. ఇప్పుడు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. కానీ రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయం కాబట్టి అంత సులువుగా మార్పు చేసే అవకాశం లేదు. స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ సమన్వయ బాధ్యతలు చూస్తున్నారు. మూడు పార్టీల శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

పట్టు బిగిస్తున్న వైసీపీ

ఇక్కడ వైసీపీ కూడా పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా సీనియర్‌ నాయకుడు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు సతీమణి పద్మావతిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు సమీప బంధువు కావడం కలిసివచ్చే అంశం. తెరవెనుక సైతం మరికొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ నాయకత్వం పరంగా ఇక్కడ సరైన ప్రోత్సాహం లేదు. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు కలుగజేసుకోవడం లేదు. ప్రస్తుత ఇన్‌చార్జి తలే రాజేష్‌ సైతం చొరవ తీసుకోలేకపోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.

----------------

Updated Date - Oct 23 , 2026 | 12:16 AM