Share News

Who knows what happened in that time అంతలోనే ఏమైందో పాపం

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:30 AM

Who knows what happened in that time వేసవి సెలవుల్లో ఇంటి వద్ద తన ఇద్దరి చెల్లెళ్లతో సరదాగా ఆడుకుంది. అమ్మనాన్నలతో కలివిడిగా ఉండేది. పెద్దకుమార్తె కావడంతో తల్లిదండ్రులు కూడా అల్లారుముద్దుగా చూసుకునేవారు. పాఠశాల పునఃప్రారంభం అయ్యాక తోటి పిల్లలతో కూడా సంతోషంగానే ఉంటోంది. యోగా డే కావడంతో ఆదివారం యోగాసనాలు వేసేందుకు మిగతా విద్యార్థినులు పిలవగా కడుపులో నొప్పిగా ఉందని, రాలేనని చెప్పింది.

Who knows what happened in that time అంతలోనే ఏమైందో పాపం
బిందుమాధవి(ఫైల్‌)

అంతలోనే ఏమైందో పాపం

కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థిని మృతి

యోగాకు రాలేనని చెప్పిన కొద్ది వ్యవధిలోనే తీవ్ర అస్వస్థత

వేపాడ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల్లో ఇంటి వద్ద తన ఇద్దరి చెల్లెళ్లతో సరదాగా ఆడుకుంది. అమ్మనాన్నలతో కలివిడిగా ఉండేది. పెద్దకుమార్తె కావడంతో తల్లిదండ్రులు కూడా అల్లారుముద్దుగా చూసుకునేవారు. పాఠశాల పునఃప్రారంభం అయ్యాక తోటి పిల్లలతో కూడా సంతోషంగానే ఉంటోంది. యోగా డే కావడంతో ఆదివారం యోగాసనాలు వేసేందుకు మిగతా విద్యార్థినులు పిలవగా కడుపులో నొప్పిగా ఉందని, రాలేనని చెప్పింది. కొద్ది నిమిషాల తర్వాత నోటి వెంట నురగలు కక్కుతూ పడిపోయింది. తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది గమనించి వెంటనే వేపాడ పీహెచ్‌సీకి తరలించారు. వారు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎస్‌.కోట సీహెచ్‌సీకి తీసుకువెళ్లాని సూచించారు. తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే బాలిక ప్రాణాలు కోల్పోయింది. జాకేరు గ్రామానికి చెందిన వారాది బింధుమాదవి(14) విషాదాంతమిది. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బక్కునాయుడుపేట కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని వారాది బిందుమాధవి (14)ఆదివారం ఉదయం 6గంటలకు యోగాకు రమ్మని పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, సహచర విద్యార్థినులు పిలిచారు. కడుపు నొప్పి వస్తోందని, యోగాకు రాలేనని చెప్పడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని వారంతా సూచించారు. దీంతో ఆమె విశ్రాంతి గదికి వెళ్లింది. కొద్దిసేపటికి బిందుమాధవి నోటి వెంట నురగ రావడాన్ని తోటి విద్యార్థినులు గమనించారు. పరుగున వచ్చిన సిబ్బంది బాలికను వేపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. వైద్య సిబ్బంది పరిశీలించి పల్స్‌ బాగా పడిపోయాయని, ఎస్‌.కోట సామాజిక ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఆమెను 108 వాహనంలో ఎస్‌.కోట తరలించేందుకు ప్రయత్నించగా పల్స్‌ పూర్తిగా పడిపోవడంతో విద్యార్థిని మృతిచెందింది. ఇదే విషయాన్ని పీహెచ్‌సీ సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారాది గణపతి, మంగలు కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ముగ్గురు కూతుళ్లు కాగా బిందుమాధవి పెద్ద కుమార్తె. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, డీసీడీవో మాలతి బాలిక స్వగ్రామం జాకేరు చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Updated Date - Jun 22 , 2026 | 12:30 AM