ఏమైందో.. ఏమో!
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:16 AM
శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం ముందురోజు ఓ మహిళ అర్ధాంతరంగా తనువు చాలించి.. ఇటు కన్నవారికి, అటు కట్టుకున్న భర్తకు తీరని క్షోభ మిగిలించింది.
విజయనగరంలో వివాహిత ఆత్మహత్య
విజయనగరం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం ముందురోజు ఓ మహిళ అర్ధాంతరంగా తనువు చాలించి.. ఇటు కన్నవారికి, అటు కట్టుకున్న భర్తకు తీరని క్షోభ మిగిలించింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరంలోని ఆర్టీసీ కాలనీలో సాయిరాం కృష్ణ, జయలక్ష్మి(36) అనే దంప తులు నివాసం ఉంటున్నారు. సాయిరాంకృష్ణ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఎప్పటిలా గే సాయిరాంకృష్ణ గురువారం విధులకు బయటకు వెళ్లారు. ఆయన ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఏమైందో ఏమో గానీ జయలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుం ది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు వెంకటరమణ వెంటనే ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నీలావతి తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసు లు దర్యాప్తు చేస్తున్నారు.