మాకు దిక్కెవరు దేవుడా?
ABN , Publish Date - May 10 , 2026 | 12:30 AM
ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్ర మే. తల్లిదండ్రులు ఇరువురు వ్యవసాయ కూలీలే.
సీతానగరం, మే 9 (ఆంధ్రజ్యోతి): ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్ర మే. తల్లిదండ్రులు ఇరువురు వ్యవసాయ కూలీలే. కుమార్తెకు వివాహం కాగా, కుమా రుడు ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడ జరిగిన రహదారి ప్రమా దంలో చనిపోయి కుటుంబానికి తీరని శోకాన్ని మిగల్చాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కృష్ణరా యపురం గ్రామానికి చెందిన గుణుపూరు భాస్కరరావు, మంగమ్మ కుమారుడు అచ్యుతరావు (26) బతుకు తెరువు కోసం రెండేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లాడు. శనివారం తెల్లవా రుజామున తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వైపు వస్తుండగా బైక్ అదుపు తప్పి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన అచ్యుతరావును ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందాడు. విషయం తెలుసు కున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుమారుడిని త్వరలో ఓ ఇంటి వాడిని చేద్దామనుకున్నామని, ఇంతలోనే విధి వక్రీకరించి తమకు తీరని క్షోభను మిగిల్చిందని, వృద్ధాప్యంలో తమకు దిక్కెవరు దేవుడా అంటూ రోదిస్తున్నారు. అచ్యుతరావు మృతితో గ్రామం లో విషాదఛాయలు అలముకున్నాయి.