Share News

తనయుడిని కాపాడ బోయి..

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:54 PM

“While Trying to Save His Son…” సీతానగరం మండలం జగ్గు జగ్గునాయుడుపేట రైల్వే ఎల్‌సీ గేటు వద్ద శుక్రవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. బొబ్బిలి స్టేషన్‌ మాస్టర్‌ కోటేశ్వరరావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా విశాఖ రైల్వేలైన్‌ సీఐ దీనబంధు కేసు దర్యాప్తు చేశారు.

  తనయుడిని కాపాడ బోయి..

  • చెడు వ్యసనాలకు బానిసైన కుమారుడు ఆత్మహత్యాయత్నం

  • రక్షించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నం

  • ఇంతలో రైలు ఢీ కొనడంతో ముగ్గురూ మృత్యువాత

  • కేసు వివరాలు వెల్లడించిన రైల్వే పోలీసులు

బొబ్బిలి/ సీతానగరం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీతానగరం మండలం జగ్గు జగ్గునాయుడుపేట రైల్వే ఎల్‌సీ గేటు వద్ద శుక్రవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. బొబ్బిలి స్టేషన్‌ మాస్టర్‌ కోటేశ్వరరావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా విశాఖ రైల్వేలైన్‌ సీఐ దీనబంధు కేసు దర్యాప్తు చేశారు. శనివారం హెచ్‌సీ ఈశ్వరరావు తెలిసిన వివరాల ప్రకారం.. ‘బొబ్బిలి పట్టణం చాకలివీధికి చెందిన చల్లపల్లి రాజేష్‌ గజపతినగరం మండలం లక్కిడాం గ్రామ సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఆయనపై బొబ్బిలి పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఉద్యోగానికి కూడా సక్రమంగా వెళ్లడం లేదు. వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలతో రాజేష్‌ సతమతమవుతుండటాన్ని చూసి తల్లిదండ్రుల హృదయం తల్లడిల్లింది. ఊరు మారితేనైనా బిడ్డలో మార్పు వస్తుందని ఆశించారు. ఆరు నెలల కిందట విజయనగరానికి మకాం మార్చారు. అయినా రాజేష్‌లో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడానికి జగ్గునాయుడుపేట రైల్వే గేటు దగ్గరకు ఆ యువకుడు వెళ్లాడు. అయితే కుమారుడిని రక్షించేందుకు వెళ్లిన తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సింహాచలాన్ని కూడా రైలు ఢీకొంది. ఈఘటనలో ముగ్గురూ మృత్యువాత పడ్డారు. వారి మృతదేహాలకు శనివారం పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.’ అని హెచ్‌సీ తెలిపారు.

Updated Date - Nov 28 , 2026 | 11:54 PM