Share News

చెట్టు తొలగిస్తుండగా..

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:42 AM

మండలంలోని అమిటి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెట్టు తొలగిస్తుండగా ఓ విద్యుత్‌ స్తంభం పడి మురపాక సుబ్బయ్యమ్మ(85) అనే మహిళ మృతి చెందింది.

చెట్టు తొలగిస్తుండగా..

తెర్లాం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని అమిటి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెట్టు తొలగిస్తుండగా ఓ విద్యుత్‌ స్తంభం పడి మురపాక సుబ్బయ్యమ్మ(85) అనే మహిళ మృతి చెందింది. అధికారుల కథనం మేరకు.. తుఫాన్‌ నేపథ్యంలో మురపాక సుబ్బయ్యమ్మ ఇంటి సమీపంలో ఓ చెట్టు వాలిపోయింది. తన ఇంటిపై పడిపోతుందన్న భయంతో ఆ చెట్టును తొలగించా లని అనుకుని ఓ వ్యక్తిని పిలిచింది. పక్కన ఉన్న ఓ చెట్టును తొలగించారు. అనంతరం తన ఇంటి వద్ద ఉన్న చెట్టును తొలగించడంతో ఆ చెట్టు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభంపై పడడంతో అది అక్కడే ఉన్న సుబ్బయ్యమ్మపై పడిపోవడంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించేందుకు ఆటోలో తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఆమెకు పెళ్లైన ఇద్దరు కూమారులు, కూమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ ధనం, ఎంపీడీవో రాంబాబు, ఎస్‌ఐ సాగర్‌బాబు పరిశీలించారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 25 , 2026 | 12:42 AM