విధులకు వెళ్లి వస్తుండగా..
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:04 AM
సీతాన గరం మండలంలోని చినభోగిలి సమీపంలో 36వ రాష్ట్రీయ రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా మక్కువకు చెందిన, కురుపాంలో లైన్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న లండా శ్రీనివాసరావు (56)ను గుర్తుతెలియని వాహనం ఢీకొని దుర్మరణం పాలయ్యాడు.
సీతానగరం/మక్కువ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): సీతాన గరం మండలంలోని చినభోగిలి సమీపంలో 36వ రాష్ట్రీయ రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా మక్కువకు చెందిన, కురుపాంలో లైన్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న లండా శ్రీనివాసరావు (56)ను గుర్తుతెలియని వాహనం ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. కురుపాం పరిధిలో ఎలక్ట్రికల్ లైన్ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం విధులకు వెళ్లి తిరిగి వచ్చిన శ్రీనివాసరావు సీతానగరం ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ వద్ద గురువారం రాత్రి నిద్రించాడు. తెల్లవారి జామున ఇంటికి వెళ్తానని అక్కడ ఉన్న వారికి తెలియజేసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఇంతలో సబ్‌స్టేష న్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోగల చినభోగిలి సమీపంలో గుర్తుతెలియని వాహనం శ్రీనివాసరావును ఢీకొంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ హేమలత ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నారు. శ్రీనివాసరావుకు భార్యతో పాటు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ప్ర స్తుతం కురుపాంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు మక్కువ నుంచి రాక పోకలు సాగిస్తున్నాడు. శ్రీనివాసరావుకు భార్య ఉమావెంకటలక్ష్మి, ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె శ్వేత సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇంటివ ద్దనే వర్కుఫ్రమ్‌హామ్‌లో ఉంటోంది. పెద్దమ్మాయి లండ భువనేశ్వరి హైదరాబాద్ లోని ప్రైవేటుకంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీనివాసరావు మృతిచెందడంతో భార్య,పిల్లలు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు.