Share News

గావు పండుగకు వెళ్లి వస్తుండగా..

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:00 AM

గావు పండుగకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆవు అడ్డుగా రావడంతో ద్విచక్ర వాహనం బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.

గావు పండుగకు వెళ్లి వస్తుండగా..

  • ఆవు అడ్డుగా రావడంతో ద్విచక్ర వాహనం బోల్తా

  • చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గుర్ల, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): గావు పండుగకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆవు అడ్డుగా రావడంతో ద్విచక్ర వాహనం బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. గుర్ల గ్రామానికి చెందిన కమ్మింది అప్పలనాయుడు (52) ఆదివారం గావు పండుగ నిమిత్తం చిన్నబంటుపల్లి వెళ్లాడు. తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా అచ్యుతాపురం దాటిన వెంటనే చుక్కపేట జంక్షన్‌ వద్ద రోడ్డుకు అడ్డంగా ఆవు రావడంతో అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. దీంతో ఒక్క సారిగా రోడ్డు మీద పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు 108కి సమాచారం అందించి, విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈయన లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పేదరికంతో ఉన్న అప్పలనాయుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరు తున్నారు. గుర్ల పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:00 AM