శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తుండగా..
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:13 AM
మండలంలోని మదుపాడ, మరుపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
గజపతినగరం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని మదుపాడ, మరుపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్ నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామానికి చెందిన ఇప్పిలి శ్రీనివాసరావు(38) గత కొంతకాలంగా సొంత ఊరు వదిలి విశాఖపట్నంలో సిమెంట్ పనులు చేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం తన ద్విచక్ర వాహనంపై పాచిపెంట మండలం మోసూరు గ్రామంలోని ఓ శుభకార్యానికి వచ్చారు. తిరిగి విశాఖపట్నం వెళ్తుండగా.. మదు పాడ, మరుపల్లి గ్రామాల మధ్య వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య శ్రీదేవి, పిల్లలు ఇప్పిలి హరి, ప్రియాంక ఉన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.