Share News

శుభకార్యానికి వెళ్తుండగా..

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:12 AM

నెల్లిమర్ల మండ లం పూతికపేట గ్రామ పరిధిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

 శుభకార్యానికి వెళ్తుండగా..

  • రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

  • ఇద్దరికి తీవ్ర గాయాలు

నెల్లిమర్ల, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల మండ లం పూతికపేట గ్రామ పరిధిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గజపతినగ రం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన వి.నరసమ్మ (35), ఆమె తమ్ముడు బన్నీ, మేనల్లుడు రాకేష్‌లు ద్విచక్రవా హనంపై ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరజాపుపేటకు ఒక శుభకార్యం నిమిత్తం వస్తున్నారు. వీరి ద్విచక్ర వాహనం పూతికపేట గ్రామం దాటుతుండగా.. రోడ్డు పక్కనే పార్కింగ్‌ చేసిన ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. అయితే అప్పటి కే నరసమ్మ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బన్నీకి కాలు విరిగిపోయిన ట్లు సమాచారం. ఈ ఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 07 , 2026 | 12:12 AM