Share News

దసరాకు ఊరు వెళుతుండగా..

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:41 AM

దసరా వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని భావించాడా వ్యక్తి.

దసరాకు ఊరు వెళుతుండగా..

  • రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

సంతకవిటి/ పొందూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): దసరా వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని భావించాడా వ్యక్తి. ద్విచక్ర వాహనంపై సొంతూరికి ఉత్సాహంగా బయలుదే రాడు. కానీ మార్గమధ్యలో వాహన ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలివీ.. విజయన గరం జిల్లా సంతకవిటి మండలం జావాం గ్రామానికి చెందిన బంకుపల్లి నారాయణరావు(36) పెయింటర్‌గా పని చేస్తున్నా డు. అతని భార్య రాజేశ్వరిది పొందూరు మండలం రాపాక గ్రామం. ఆమె శ్రీకాకుళలోని ప్రైవేటు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. దీంతో నారాయణరావు రాపాక కూడలి సమీపంలోని కుమ్మరి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో నివాసం ఉంటున్నారు. మంగళవారం దసరా కావడంతో నారాయణరావు సొంతూరు జావాం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండ గా... పొందూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహ నం బలంగా ఢీకొంది. దీంతో నారాయణరావు తలకు తీవ్రగాయమైంది. వెంటనే నారాయణరావును 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పొందూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణరావుకు కుమార్తె డిల్లీశ్వరి, కుమారుడు విష్ణువర్ధన్‌ ఉన్నా రు. పండగ వేళ ఇంటి పెద్ద మృతిచెందడంతో సొంతూరు జావాం, అత్తవారి గ్రామం రాపాకలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Oct 22 , 2026 | 12:41 AM