Share News

కూలిపనికి వెళ్తూ..

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:17 AM

కూలిపనికి వెళ్తుండగా లగేజ్‌ఆటోలో నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.

 కూలిపనికి వెళ్తూ..

గజపతినగరం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): కూలిపనికి వెళ్తుండగా లగేజ్‌ఆటోలో నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌ నాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పురి టిపెంట పంచాయతీలో మామిడిబంద కాలనీకి చెందిన గెద్ద శ్రీనివాసరావు(45) సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ జీవనో పాధి సాగిస్తున్నాడు. రోజూ లాగానే సోమవారం గజపతి నగరం నుంచి జగనన్న కాలనీలో సెంట్రింగ్‌ పనుల నిమిత్తం లైగేజీ ఆటోలో ఐరన్‌ లోడ్‌ తీసుకువెళ్తున్నాడు. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడంతో ఎన్‌జీఆర్‌ పురం గ్రామం వద్దకు వచ్చేసరికి ఆటోపైన కూర్చున్న శ్రీనివాసరావు ఐరన్‌ లోడ్‌తో పాటు కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయ పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తమ్మ, పిల్లలు శ్రావణి, శ్రవంత్‌ కలరు. శ్రవంత్‌ బీటెక్‌ గరివిడిలో చదువుతుండగా, శ్రావణి హైదరాబాద్‌ లో సాఫ్ట్‌వేర్‌ శిక్షణ తీసుకుంటుంది. భార్య ముత్తమ్మ చేసిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. మరుపల్లి గ్రామానికి చెందిన గెద్ద శ్రీనివాసరావు జీవనోపాధి నిమిత్తం గజపతి నగరం వచ్చి మామిడి బంద కాలనీలో నివాసం ఉంటున్నారు. పిల్లలను ఉన్నత చదువులను చదివించాలన్న లక్ష్యంతో సెంట్రింగ్‌ పనులకు వెళ్తూ కుటుంబ పోష ణ సాగిస్తున్నారు. ఈయన మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది.

Updated Date - Nov 17 , 2026 | 12:17 AM