అమ్మవారి పండుగకు వెళ్లి వస్తుండగా..
ABN , Publish Date - May 01 , 2026 | 12:34 AM
మండలంలో ని వాబ జంక్షన్ మలుపు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమా దంలో పాలకొండ మండలం జంపరకోట గ్రామానికి చెందిన గిరిజనుడు జీలకర్ర మోహనరావు(60) మృతి చెందాడు.
సీతంపేట రూరల్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): మండలంలో ని వాబ జంక్షన్ మలుపు వద్ద గురువార జరిగిన రోడ్డు ప్రమా దంలో పాలకొండ మండలం జంపరకోట గ్రామానికి చెందిన గిరిజనుడు జీలకర్ర మోహనరావు(60) మృతి చెందాడు. స్థాని క ఎస్‌ఐ అమ్మన్నరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జంపరకోట గ్రామానికి చెందిన జీలకర్ర మోహనరావు అతడి భార్య జీలకర్ర వరలక్ష్మి గురువారం సీతంపేట మండలంలోని రాయికురిడి గ్రామంలో జరుగుతున్న అమ్మవారి పండుగలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పండగను చూసుకుని తిరిగి వస్తుండగా సీతంపేట సమీపంలోని వాబ జంక్షన్ మలుపు వద్ద పాలకొండ నుంచి కొత్తూరు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వీరిని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో జీలకర్ర మోహనరావు అక్కడిక క్కడే మృతిచెందాడు. వరలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానికులు 108 వాహనంలో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి వరలక్ష్మి ని శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మృతుడికి ఇద్దరు కుమారు లు. ఓ కుమార్తె ఉన్నారు. ఒక ఆడపిల్ల ఉన్నారు. మోహనరావు టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగు తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.