శుభకార్యానికి వెళ్లి వస్తుండగా..
ABN , Publish Date - May 17 , 2026 | 11:52 PM
డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద ఓ ప్రైవేటు పాఠశాల ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెం గ్రామానికి చెందిన వలిరెడ్డి పద్మ(49) అనే మహిళ మృతిచెందింది.
డెంకాడ/పూసపాటిరేగ, మే 17(ఆంధ్రజ్యోతి): డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద ఓ ప్రైవేటు పాఠశాల ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెం గ్రామానికి చెందిన వలిరెడ్డి పద్మ(49) అనే మహిళ మృతిచెందింది. ఎస్‌ఐ సన్యాసినాయుడు కథనం మేరకు.. పూసపాటిపాలెం నుంచి జామి మండలం భీమసింగిలో వారి బంధువుల శుభకార్యానికి హాజరయ్యేందుకు పద్మతో పాటు ఆమె దగ్గర బంధువులు నలుగురు ఆటోలో వెళ్లారు. తిరిగి వస్తుండగా పెదతాడివాడ వద్ద స్టాపర్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటో నెమ్మదిగా వెళ్లే క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీకొంది. దీంతో ఆటో బోల్తాపడడంతో సీటుపై కూర్చొన్న పద్మకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందింది. మిగిలిన వారు సుక్షితంగా బయటపడ్డారు. పద్మకు భర్త భాస్కరరావుతోపాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరగ్గా కుమారుడికి ఇంకా వివాహం కాలేదు. ఘటనా స్థలానికి ఎస్‌ఐ చేరుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.