విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:19 AM
రామభద్రపురంలోని చినమ్మతల్లి అమ్మవారి ఆలయం సమీపంలో శనివారం రాత్రి ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొ నడంతో యువకుడు మృతిచెందాడు.
రామభద్రపురం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రామభద్రపురంలోని చినమ్మతల్లి అమ్మవారి ఆలయం సమీపంలో శనివారం రాత్రి ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొ నడంతో యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ వెలమల ప్రసాద్ కథనం మేరకు.. బొబ్బిలి మండలంలోని కమ్మవలస గ్రామానికి చెందిన సత్తారపు రాము(20) రా మభద్రపురం స్టార్ అన్నపూర్ణలో వంటమేస్త్రిగా పనిచేస్తున్నాడు. విధులు ము గించుకొని ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఆ సమయంలోబొబ్బిలి నుం చి రామభద్రపురం వైపు వెళ్తున్న వ్యాన్ ద్విచ క్రవాహనాన్ని ఢీకొనడంతో అక్క డికక్కడే రాము మృతిచెందాడు. రాముకి తండ్రి సూరి, తల్లి పార్వతి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.