Coconut Saplings? కొబ్బరి మొక్కలేవీ?
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:47 PM
Where Are the Coconut Saplings? జియ్యమ్మవలస మండలంలో బ్లాక్ ప్లాంటేషన్ కింద నాటిన వందలాది కొబ్బరి మొక్కలు ఏమయ్యాయో? తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకోసం లక్షలాది రూపాయలు డ్రా చేసినట్లు విచారణలో తేలింది.
ఇందుకోసం లక్షలాది రూపాయలు డ్రా
సామాజిక తనిఖీలో బయటపడ్డ అక్రమాలు
జియ్యమ్మవలస, ఏప్రిల్21(ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలంలో బ్లాక్ ప్లాంటేషన్ కింద నాటిన వందలాది కొబ్బరి మొక్కలు ఏమయ్యాయో? తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకోసం లక్షలాది రూపాయలు డ్రా చేసినట్లు విచారణలో తేలింది. మంగళవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో 2024-25లో చేపట్టిన ఉపాధి హామీ పనులపై బహిరంగ విచారణ జరపగా పలు అక్రమాలు బయటపడ్డాయి. మొత్తంగా రూ. 30.63 కోట్ల మేర పనులు జరగ్గా.. ఇందులో వేతనాల రూపంలో రూ. 23.75 కోట్లు, మెటీరియల్ రూపంలో రూ.6.88 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అయితే మండలంలో పలుచోట్ల నాటిన వందలాది కొబ్బరి మొక్కలు కనిపించకపోవడం చర్చనీ యాంశమైంది. బ్లాక్ ప్లాంటేషన్ కింద సిబ్బంది నిధులు దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఫాంపాండ్స్, ఫిష్ ఫాండ్ నిర్మాణాల కొలతల్లో తేడాలు ఉన్నట్లు తనిఖీ బృందం తేల్చగా సంవ త్సర కాలం దాటిపోయినందున అధికారులు దానిని పక్కన పెట్టారు. మస్తర్ల పరిస్థితి దారుణంగా ఉందని, దిద్దుబాట్లు, రానివారి పేరిట సంతకాలు ఉన్నట్లు తనిఖీ సిబ్బంది గుర్తించారు. అయితే దీని బాధ్యులైన వారికి అధికారులు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీలు త్రివిక్రమరావు, శ్రీహరి, ఎస్‌ఆర్‌పీ మన్మఽథరావు ఎంపీడీవో హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.