Share News

Posts Be Filled? ఆ పోస్టుల భర్తీ ఎప్పుడో?

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:08 AM

When Will Those Posts Be Filled? జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇంజనీర్ల కొరత వేధిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో ప్రాజెక్టుల పర్యవేక్షణ కష్టతర మవుతోంది. మరోవైపు ప్రతి 1500 ఎకరాలకు ఒక లస్కర్‌ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పంట భూములకు సాగునీటి సరఫరాలో కీలకంగా వ్యవహరించే లస్కర్లు లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇంజనీర్లకు అవస్థలు తప్పడం లేదు.

  Posts Be Filled? ఆ పోస్టుల భర్తీ ఎప్పుడో?
జంఝావ‌తి ప్రాజెక్ట్‌

  • లస్కర్ల నియామకానికీ చర్యలు శూన్యం

  • కొరవడుతున్న పర్యవేక్షణ.. సాగునీటి సరఫరాలో ఆటంకాలు

పార్వతీపురం, ఏప్రిల్‌4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇంజనీర్ల కొరత వేధిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో ప్రాజెక్టుల పర్యవేక్షణ కష్టతర మవుతోంది. మరోవైపు ప్రతి 1500 ఎకరాలకు ఒక లస్కర్‌ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పంట భూములకు సాగునీటి సరఫరాలో కీలకంగా వ్యవహరించే లస్కర్లు లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇంజనీర్లకు అవస్థలు తప్పడం లేదు. తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో ఎనిమిది అసిస్టెంట్‌ ఇంజనీర్లు పోస్టులు ఉంటే.. అందులో నాలుగు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ సుమారు 30 మంది లస్కర్లు అవసరం ఉన్నా.. కొన్ని దశాబ్దాలుగా నియామకాలు చేపట్టడం లేదు. ఇక వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) పరిధి లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు ఖాళీగా లేనప్పటికీ లస్కర్ల నియామకం జరగడం లేదు. పెద్దగెడ్డ ప్రాజెక్టు పరిధిలో మూడు అసిస్టెంట్‌ ఇంజనీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఒకరు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలోనూ లస్కర్లు నియామకం చేపట్టలేదు. జంఝావతి ప్రాజెక్టు పరిధిలో 16 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్ల పోస్టులున్నా.. ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఇక పెదంకలం ప్రాజెక్టు పరిధిలో ముగ్గురు అసిస్టెంట్‌ ఇంజనీర్లకు గాను ఇద్దరు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది.

Updated Date - Apr 05 , 2026 | 12:08 AM