Share News

“When Will the Posts Be Filled?” పోస్టుల భర్తీ ఎప్పుడు?

ABN , Publish Date - May 12 , 2026 | 11:59 PM

“When Will the Posts Be Filled?” పార్వతీపురం డివిజన్‌ కేంద్రానికి అధికారుల కొరత వేధిస్తోంది. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రధానంగా పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌ కేంద్రానికి కీలకమైన ఆర్డీవో పోస్టు కొన్నాళ్లుగా ఖాళీగానే ఉంది.

“When Will the Posts Be Filled?”    పోస్టుల భర్తీ ఎప్పుడు?
రెగ్యులర్‌ అధికారి లేని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం

కొన్నేళ్లుగా ఆర్డీవో కుర్చీ ఖాళీ

మరికొన్ని కీలక శాఖల్లోనూ అదే పరిస్థితి..

ప్రజలకు తప్పని ఇబ్బందులు

పార్వతీపురం, మే12(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం డివిజన్‌ కేంద్రానికి అధికారుల కొరత వేధిస్తోంది. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రధానంగా పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌ కేంద్రానికి కీలకమైన ఆర్డీవో పోస్టు కొన్నాళ్లుగా ఖాళీగానే ఉంది. సబ్‌ కలెక్టర్‌గా పనిచేసిన వైశాలి పార్వతీపురం ఐటీడీఏ రెగ్యులర్‌ పీవోగా నియామకమయ్యారు. దీంతో సబ్‌ కలెక్టర్‌ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో ఆర్డీవో నియామకం చేపడతామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించినా.. ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఐటీడీఏ పీవో వైశాలి సబ్‌ కలెక్టర్‌ విధులను కూడా నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో గృహ నిర్మాణశాఖ డీఎం, సాంఘిక సంక్షేమశాఖ అధికారి, డీఆర్‌డీఏ పీడీ తదితర పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. కొన్నాళ్లుగా ఇతర శాఖల అధికారులే ఆయా పోస్టుల్లో ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఐటీడీఏ పీవో వైశాలిసబ్‌ కలెక్టర్‌తో పాటు డీఆర్‌డీఏ పీడీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - May 12 , 2026 | 11:59 PM